Telugu Global
Andhra Pradesh

టీడీపీకి షాక్.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రచారంపై ఈసీ సీరియస్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ M.K. మీనా.. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

టీడీపీకి షాక్.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రచారంపై ఈసీ సీరియస్‌
X

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ అంశంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌పై IVRS కాల్స్‌తో ఓటర్లను TDP తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈసీకి ఫిర్యాదు చేసిన‌ అనంతరం మీడియాతో మాట్లాడారు మల్లాది విష్ణు. టీడీపీ ఫేక్ ప్రచారంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు.



ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ M.K. మీనా.. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యల గురించి రిపోర్టు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. దీంతో టీడీపీపై ఎలాంటి చర్యలుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  4 May 2024 4:46 PM GMT
Next Story