Telugu Global
Andhra Pradesh

వైఎస్ వివేకా హత్యపై షర్మిల షాకింగ్ కామెంట్స్

వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో దోషుల‌కు ఖ‌చ్చితంగా శిక్ష‌ప‌డాలని, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని వైఎస్ షర్మిల‌ అన్నారు. వివేకా హ‌త్య త‌మ కుటుంబంలో జ‌రిగిన అత్యంత ఘోరం అని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో సునీత కు న్యాయం జ‌ర‌గాల‌ని ష‌ర్మిల ఆకాంక్షించారు.

వైఎస్ వివేకా హత్యపై షర్మిల షాకింగ్ కామెంట్స్
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ( వైఎస్సార్‌ టిపి) అధ్య‌క్షురాలు ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ హ‌త్య కేసులో దోషుల‌కు ఖ‌చ్చితంగా శిక్ష‌ప‌డాల‌ని వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆమె అన్నారు. వివేకా హ‌త్య త‌మ కుటుంబంలో జ‌రిగిన అత్యంత ఘోరం అని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో సునీత కు న్యాయం జ‌ర‌గాల‌ని ష‌ర్మిల ఆకాంక్షించారు. ద‌ర్యాప్తును పార‌ద‌ర్శ‌కంగా వేగంగా జ‌ర‌పాల‌ని ఆమె కోరారు.

కాగా, ఇప్ప‌టికే వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను ఏపీలో కాకుండా ఇత‌ర రాష్ట్రంలో నిర్వ‌హించాల‌ని కోరుతూ వివేకా కుమార్తె సునీతరెడ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌మిళ‌నాడు లేదా క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో విచార‌ణ జ‌రిగేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు. ఈ విచార‌ణ సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిపించాల‌ని ఆమె త‌న పిటిష‌న్ లో కోరింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌రు సాక్షులు మ‌ర‌ణించార‌ని, బ‌తికి ఉన్న సాక్షుల

ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.

ఈ పిటిష‌న్ ను సుప్రీం ధ‌ర్యాస‌నం విచారించింది. సుప్రీం కోర్టు ..ఏ రాష్ట్ర హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నార‌ని నిందితుల‌ను కూడా ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసు విచార‌ణ‌కు సునీత త‌ర‌పు న్య‌యావాది అంగీక‌రించినా సిబిఐ త‌ర‌పు న్యాయవాది వ్య‌తిరేకించారు. దీంతో మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ విష‌య‌మై నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈ కేసు విచార‌ణ ఎప్పుడు పూర్తి చేయ‌గ‌ల‌రో చెప్ప‌క‌పోవ‌డంపై సిబిఐ పై ధ‌ర్మాసనం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

First Published:  21 Oct 2022 11:56 AM GMT
Next Story