Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు దృష్టిలో వాలంటీర్లు ఎవరంటే..?

బాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వారినే వాలంటీర్లుగా కొనసాగిస్తారనే నమ్మకం ఏంటి..? జగన్ కోసం రాజీనామా చేసినవాళ్లని టార్గెట్ చేయరనే గ్యారెంటీ ఏంటి..?

చంద్రబాబు దృష్టిలో వాలంటీర్లు ఎవరంటే..?
X

వాలంటీర్ వ్యవస్థే దండగ అన్న చంద్రబాబు ఎన్నికల వేళ వారి జీతాలు రెట్టింపు చేస్తానని చెప్పడం నిజంగానే విడ్డూరం. అయితే చంద్రబాబు ఓ మాస్టర్ ప్లాన్ వేశారని, అందులో భాగంగానే వాలంటీర్ల జీతాలు పెంచుతానంటూ హామీ ఇచ్చారని అంటున్నారు సజ్జల. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేది లేదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారాయన. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను నమ్మేంత అమాయకులెవరూ లేరని అన్నారు సజ్జల.

చంద్రబాబు ప్లాన్ ఏంటంటే..?

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు సొంత పార్టీ కార్యకర్తలకు పెత్తనం అప్పగించారు. అప్పట్లో పెన్షన్ దరఖాస్తు పెట్టాలన్నా, పథకాలకు అప్లై చేసుకోవాలన్నా ముందు ఆ కమిటీలకు డబ్బులు ముట్టజెప్పాలి. ఆఖరికి గ్రామంలో జరిగిన కాంట్రాక్ పనుల బిల్లులు మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలకు ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి ఉండేది. అలాంటి వ్యవస్థను తీసేసి ప్రజలకు సేవచేసే వాలంటీర్లను నియమించారు సీఎం జగన్. వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.5వేలు ఇస్తున్నారు. ఈ వ్యవస్థపై కక్షగట్టిన చంద్రబాబు పలుమార్లు తన అక్కసు వెళ్లగక్కారు. చివరకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుసుకుని వాలంటీర్ వ్యవస్థకు జై కొట్టారు. పైగా జీతం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు సజ్జల. పేరుకి వాలంటీర్లు అయినా.. జన్మభూమి కమిటీల్లో సభ్యులకే ఆ పోస్ట్ లు ఇస్తారని అనుమానం వ్యక్తం చేశారు. బాబు అధికారంలోకి వస్తే నేరుగా టీడీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని జీతాలిస్తారని, అందుకే జీతాలు పెంచుతానంటూ ఆయన హామీ ఇచ్చారని అన్నారు. బాబు పాచిక పారదని, ఆయన అధికారంలోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారు సజ్జల.

జగన్ ఎలాగూ రూ.5వేలు ఇస్తున్నారు. తాను ఇంకో ఐదు వేలు కలిపి.. తనవాళ్లకే ఇస్తే నష్టమేముంది అని ఆలోచించారు చంద్రబాబు. అందుకే వాలంటీర్ల జీతం పెంచుతానంటూ ప్రకటించారు. బాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న వారినే వాలంటీర్లుగా కొనసాగిస్తారనే నమ్మకం ఏంటి..? జగన్ కోసం రాజీనామా చేసినవాళ్లని టార్గెట్ చేయరనే గ్యారెంటీ ఏంటి..? జిత్తులమారి బాబుని నమ్మేందుకు వాలంటీర్లు అమాయకులు కాదు. పదే పదే బాబు హామీలకు పడిపోడానికి ఏపీ ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకుని లేరు.

First Published:  12 April 2024 5:13 AM GMT
Next Story