Telugu Global
Andhra Pradesh

ఇంతకీ సాయిప్రియకు ఇప్పుడు భర్త ఎవరు..? పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..

మూడు రోజులపాటు టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచిన విశాఖ పట్నం సాయి ప్రియ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి చేరింది.

ఇంతకీ సాయిప్రియకు ఇప్పుడు భర్త ఎవరు..? పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..
X

మూడు రోజులపాటు టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచిన విశాఖ పట్నం సాయి ప్రియ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి చేరింది. బెంగళూరులో సాయిప్రియ దంపతుల లొకేషన్ ని కనిపెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి విశాఖకు తరలించారు. ప్రస్తుతం విశాఖలో పోలీసుల అదుపులో సాయిప్రియ తన నూతన భర్తతో కలసి ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు..? పాత భర్త వచ్చి రాద్ధాంతం చేస్తే సమస్యని ఎలా పరిష్కరిస్తారు. ఆ తాళి తెంచుకుని ఈ తాళి కట్టించుకున్న సాయిప్రియ ఎవరి దగ్గర ఉండాలి? చట్టం ఏం చెబుతుంది..? పోలీసుల పరిధి ఎంత..? ఇదో విచిత్రమైన కేసుగా మారింది.

మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే రెండో వ్యక్తిని భర్తగా స్వీకరించింది సాయిప్రియ. చాలా చోట్ల జరిగే సంఘటనలే అయినా.. ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. సాయిప్రియను కిడ్నాప్ అయినట్టు పోలీస్ స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు, ఆ తర్వాత రవి కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదుని మార్చారు. దీంతో బెంగళూరు నుంచి వారిద్దరినీ పోలీసులు విశాఖకు తీసుకొచ్చారు. మొదటి భర్త శ్రీనివాసరావు అసలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారా, లేక సాయిప్రియ తల్లిదండ్రులకే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేస్తారా..?

సాయిప్రియ వ్యవహారంలో విశాఖ జిల్లా కలెక్టర్, నగర మేయర్, కమిషనర్ సహా.. అధికారులంతా మోసపోయారు. ఆమె సముద్రంలో మునిగిపోయిందేమోనని కంగారు పడ్డారు. నేవీ హెలికాప్టర్లతో వెదుకులాట సహా.. అంతా కలిపి కోటి రూపాయలు ఖర్చు చేశారని అనధికారిక సమాచారం. మరి సాయిప్రియను పోలీసులు అలాగే వదిలేస్తారా..? కొత్త భర్తతో ఉండేందుకు అంగీకరించి రక్షణ కల్పిస్తారా..? లేక కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపిస్తారా..? వేచి చూడాలి. కొంతలో కొంత సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో ప్రియుడి మోజులో భర్తల్ని హతమార్చిన భార్యల లిస్ట్ లో సాయిప్రియ చేరాలనుకోకపోవడం. మొదటి భర్తకు ఎలాంటి హాని తలపెట్టకుండానే రెండో భర్తతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని వచ్చింది సాయిప్రియ. ఈ నమ్మక ద్రోహాన్ని విశాఖ పోలీసులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

First Published:  29 July 2022 3:53 PM GMT
Next Story