Telugu Global
Andhra Pradesh

ఆర్కే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ ఫెయిల్.. గ్రీష్మ పొలిటిక‌ల్ కెరీర్‌కి ఎండ్ కార్డ్‌

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా టిడిపి అధిష్టానంపై ఒత్తిడి పెంచామ‌ని త‌ల్లీకూతుర్లు సంబ‌ర‌ప‌డ్డారు. అదే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ ఫెయిలై, పార్టీలో ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది. గ‌త కొన్ని నెల‌లుగా కావ‌లి గ్రీష్మ టిడిపి కార్య‌క్ర‌మాల‌లోనూ, మీడియాలోనూ క‌న‌ప‌డక‌పోవ‌డానికి ఆర్కే ఇంట‌ర్వ్యూ ఎఫెక్ట్ అని టిడిపిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆర్కే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ ఫెయిల్.. గ్రీష్మ పొలిటిక‌ల్ కెరీర్‌కి ఎండ్ కార్డ్‌
X

ఆప‌రేష‌న్ స‌క్సెస్..పేషెంట్ డెడ్ అంటే ఇదే. ఏదో అనుకుని ప్లాన్ చేస్తే ఇంకేదో అయ్యింది. తెలుగుదేశం పార్టీలో ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభా భార‌తి చాన్నాళ్ల త‌రువాత యాక్టివ్ అయ్యారు. ఆమె కుమార్తె గ్రీష్మ కూడా సోష‌ల్ మీడియా, మీడియా ద్వారా పార్టీ పెద్ద‌ల‌ అటెన్ష‌న్‌ని గ్రాబ్ చేశారు. అంద‌రూ త‌మ వార‌సుల్ని రాజ‌కీయాల‌కి ప‌రిచ‌యం చేస్తున్న నేప‌థ్యంలో త‌న కుమార్తె రాజ‌కీయ అరంగేట్రానికి ఇదే స‌మ‌యం అని ప్ర‌తిభా భార‌తి భావించారు.

రాజాంలో ఆల్రెడీ టిడిపి అభ్య‌ర్థిగా కోండ్రు ముర‌ళీ మోహ‌న్ ఉన్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్ కూడా ప్ర‌తిభా భార‌తి వెంట లేదు. పొలిట్ బ్యూరో స‌భ్యురాలిగా త‌న సేవ‌లను పార్టీ గుర్తించి కుమార్తె గ్రీష్మ‌కి సీటు ఇవ్వాల‌నే డిమాండ్‌ని మీడియా వేదిక‌గా బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని యోచించారు. ఆంధ్ర‌జ్యోతి - ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ‌తో ఉన్న ప‌రిచ‌యం మేర‌కు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర‌మానికి కుమార్తె గ్రీష్మ‌ని తీసుకెళ్లారు. అదే వేదిక‌పై నుంచి రాజాం టిడిపి సీటు డిమాండ్‌ని లేవ‌నెత్తారు.

ఆ ఇంట‌ర్వ్యూలో తాను రాజాంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని చంద్రబాబుకు చెప్పానంటూ ఆర్కేకి గ్రీష్మ చెప్పారు. అక్క‌డితో ఆగ‌కుండా చంద్ర‌బాబుని బ్లాక్ మెయిల్ చేసేలా పార్టీలో స్థిరంగా ఉండే మాలాంటి వాళ్లు కావాలా.. జంపింగ్‌లు చేసేవాళ్లు కావాలా అంటూ ప‌రోక్షంగా కోండ్రు ముర‌ళీ గురించి ప్ర‌స్తావిస్తూ పార్టీ ఎటో తేల్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కావడమే త‌న టార్గెట్ అని చెప్పి ఊరుకోకుండా చంద్రబాబును సీఎం చేస్తానంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసింది గ్రీష్మ‌. మ‌ధ్య‌లో లోకేష్‌ని కూడా లాక్కొచ్చింది. తాను సీటు అడిగితే ప‌నిచేయండి చూద్దాం అన్నార‌ని లోకేష్‌ని కూడా ఫిక్స్ చేయాల‌ని ప్ర‌య‌త్నించింది.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా టిడిపి అధిష్టానంపై ఒత్తిడి పెంచామ‌ని త‌ల్లీకూతుర్లు సంబ‌ర‌ప‌డ్డారు. అదే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ ఫెయిలై, పార్టీలో ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది. టికెట్ కోసం ప్ర‌య‌త్నించ‌డం వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, చంద్ర‌బాబు తేల్చుకోవాలి, బాబుని సీఎంని చేస్తానంటూ త‌న స్థాయికి మించిన ప్ర‌గ‌ల్భాలు, ఆల్రెడీ నియోజ‌క‌వ‌ర్గ టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న కోండ్రు ముర‌ళీమోహ‌న్‌ని టార్గెట్ చేయ‌డం వంటి అంశాల‌పై అధిష్టానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందని స‌మాచారం. ఈ ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అయిన త‌రువాత గ్రీష్మ పూర్తిగా తెర‌మ‌రుగైపోయింది. అంత‌కంటే ముందు మ‌హానాడు వేదిక‌పై నుంచి తొడ కొట్ట‌డం, మీడియాలో అధికార ప్ర‌తినిధిగా త‌న వాయిస్ వినిపించేది. ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మానికి వెళ్లి, టిడిపి అధిష్టానంపై ఒత్తిడి పెంచి సీటు సంపాదించేయాల‌నే అత్యుత్సాహం ఏకంగా పార్టీలో గ్రీష్మ స్థానానికే ఎస‌రు పెట్టింది. గ‌త కొన్ని నెల‌లుగా కావ‌లి గ్రీష్మ టిడిపి కార్య‌క్ర‌మాల‌లోనూ, మీడియాలోనూ క‌న‌ప‌డక‌పోవ‌డానికి ఏబీఎన్ ఆర్కే ఇంట‌ర్వ్యూ ఎఫెక్ట్ అని టిడిపిలో గుస‌గుస‌లు.

First Published:  8 May 2023 3:37 AM GMT
Next Story