Telugu Global
Andhra Pradesh

కాపులను బాగా కెలికేసిన వర్మ

చంద్రబాబు, పవన్ భేటీపై ఒక సెక్షన్ కాపులు మండిపోతున్నారు. సొంత ప్రయోజనాల కోసమే కాపుల ఓట్లను చంద్రబాబు అంటే కమ్మోళ్ళకి పణంగా పెట్టేస్తావా అంటూ పవన్‌పై మండిపోతున్నారు.

కాపులను బాగా కెలికేసిన వర్మ
X

కాపులను బాగా కెలికేసిన వర్మ

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీలో ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. దాదాపు రెండున్నరగంటల భేటీలో కచ్చితంగా రాజకీయాలే మాట్లాడుకుని ఉంటారనటంలో ఎలాంటి సందేహంలేదు. పొత్తులు, సీట్లు గురించి మాట్లాడుకున్నారని మీడియా, సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులు మాట్లాడుకుంటామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను ఎదుర్కొనే విషయాన్ని మాత్రమే మాట్లాడుకున్నామని ఇద్దరు చెప్పారు.

అయితే వీళ్ళ మాటలను జనాలెవరు నమ్మటం లేదు. మంత్రులు, వైసీపీ నేతలైతే ఇద్దరి భేటీపైన ఎవరికి తోచినట్లు వాళ్ళు రెచ్చిపోతున్నారు. వీళ్ళసంగతిని పక్కనపెట్టేస్తే ఇద్దరి భేటీపైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ బాగా వైరల్ అవుతోంది. వైరల్ సంగతిని అటుంచితే కాపులను బాగా మండిస్తోంది. ఆ మంట వర్మపైనా లేకపోతే పవన్ కల్యాణ్‌పైనా అన్న విషయంలో స్పష్టత లేదు. ఇంతకీ వర్మ చేసిన ట్వీట్ ఏమిటంటే ‘కేవలం డబ్బుకోసమే తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు... రిప్ (RIP) కాపులు, కంగ్రాట్చులేషన్స్ టు కమ్మోళ్ళు’.

ఇది వర్మ చేసిన తాజా ట్వీట్. దీంతో చంద్రబాబు, పవన్ భేటీపై ఒక సెక్షన్ కాపులు మండిపోతున్నారు. సొంత ప్రయోజనాల కోసమే కాపుల ఓట్లను చంద్రబాబు అంటే కమ్మోళ్ళకి పణంగా పెట్టేస్తావా అంటూ పవన్‌పై మండిపోతున్నారు. అలాగే చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని కాపుల ఓట్లను కమ్మోరికి తాకట్టుపెడతావా? అంటూ పవన్‌పై ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. కాపు సామాజికవర్గం తరపున ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్‌కు మాత్రమే ఉందని కాపులందరు నమ్ముతున్నారు.

అయితే ఇదే సమయంలో చంద్రబాబు పల్లకి మోయటానికి పవన్ సిద్ధపడటాన్ని కాపుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ జనసేనను పెట్టాడని నమ్ముతున్న కాపులంతా పవన్‌ను వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కోసం కాకుండా కాపుల కోసం మాత్రమే పోరాటం చేస్తాడని నమ్మినపుడు మాత్రమే పవన్‌కు మద్దతుగా కాపు ప్రముఖులు నిలబడతారు. లేకపోతే మెజారిటి కాపులను దూరం చేసుకుని చంద్రబాబు దగ్గరైనా పవన్ సాధించేది ఏమీ ఉండదు. ఈ నేపధ్యంలోనే వర్మ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ కాపులు మండిపోతున్నారు.

First Published:  9 Jan 2023 6:05 AM GMT
Next Story