Telugu Global
Andhra Pradesh

గంజాయిలో ఏపీ నంబర్ వన్. కారణం ఏంటంటే?

ఏపీలో గంజాయికి సంబంధించి 1,775 కేసులు నమోదు చేసి 4,202 మందిని అరెస్ట్ చేసినట్టు రిపోర్టు వెల్లడించింది. తెలంగాణలో 35వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. హెరాయిన్‌ విషయంలో గుజరాత్ నంబర్‌ వన్ స్థానంలో ఉంది.

గంజాయిలో ఏపీ నంబర్ వన్. కారణం ఏంటంటే?
X

దేశంలోనే అత్యధిక స్థాయిలో గంజాయి పట్టుబడింది ఏపీలోనే అని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు వెల్లడించింది. అత్యధిక స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్న రాష్ట్రంగా ఏపీ నంబర్‌ వన్ స్థానంలో నిలిచింది. 2021 ఏడాదికి సంబంధించిన రిపోర్టులో ఈ విషయాన్ని ఎన్‌సీబీ వెల్లడించింది.

గతేడాది ఏపీలోనే 26 శాతం గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7 లక్షల 49వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. ఒక్క ఏపీలోనే రెండు లక్షల కిలోలు పట్టుబడింది. ఆ తర్వాతి స్థానంలో పక్కనే ఉన్న ఒడిశా ఉంది. ఒడిశాలో లక్షా 71వేల కిలోల గంజాయిని గతేడాదిగా పోలీసులు పట్టుకున్నారు. దేశంలో పట్టుబడిన గంజాయిలో ఏపీ, ఒడిశా వాటానే 50 శాతం వరకు ఉంది.

ఏపీలో గంజాయికి సంబంధించి 1,775 కేసులు నమోదు చేసి 4,202 మందిని అరెస్ట్ చేసినట్టు రిపోర్టు వెల్లడించింది. తెలంగాణలో 35వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. హెరాయిన్‌ విషయంలో గుజరాత్ నంబర్‌ వన్ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 7,618 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. ఒక్క గుజరాత్‌లోనే 3,334 కిలోలు దొరికింది.

ఏపీ, ఒడిశాలో ఎక్కువ‌గా గంజాయి పట్టుబడడానికి కారణం. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు అనువుగా ఉండడంతో ముఠాలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడమే. దానికి తోడు ఏపీ పోలీసులు ప్రత్యేకంగా గంజాయిపై దృష్టి సారించి భారీగా దాడులు చేయడంతో ఎక్కువ‌గా గంజాయి పట్టుబడింది.

First Published:  29 Sep 2022 6:16 AM GMT
Next Story