Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై మరోసారి మండిపడ్డ రాయపాటి రంగారావు

చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ అని, కరప్షన్‌ కింగ్‌ అని రాయపాటి రంగారావు తెలిపారు. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్‌ అని విమర్శించారు.

చంద్రబాబుపై మరోసారి మండిపడ్డ రాయపాటి రంగారావు
X

చంద్రబాబుపై ఆగ్రహాన్ని ఆయన ఫొటోను నేలకేసి కొట్టి మరీ వెళ్లగక్కిన రాయపాటి రంగారావు.. బాబుపై మరోసారి మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని విమర్శించారు. అయితే.. ఇప్పుడు తన కుటుంబంపై పడ్డారంటూ ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే రాయపాటి శైలజతో తనపై విమర్శలు చేయిస్తున్నారని రంగారావు విమర్శించారు.

ఎవరీ శైలజ...

రాయపాటి శైలజ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె. రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో పాటు చంద్రబాబుపై, లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. తమనుంచి అన్యాయంగా కోట్ల కొద్దీ నగదు కొల్లగొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో కోట్ల కొద్దీ సొమ్ము తినేశారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు.. చంద్రబాబు చిత్రపటాన్ని నేలకోసి కొటి మరీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ నుంచి బయటికి వచ్చింది రాయపాటి రంగారావు మాత్రమేనని, కుటుంబం మొత్తం కాదని చెప్పారు.

శైలజకు రంగారావు కౌంటర్‌

ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ వ్యాఖ్యలపై రాయపాటి రంగారావు స్పందించారు. తమ కుటుంబంలో చిచ్చు పెట్టడానికే శైలజతో తనపై చంద్రబాబు ఆరోపణలు చేయిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అసలు శైలజకు పార్టీలో సభ్యత్వం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలన్నారు. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్‌ అకౌంట్‌లోకి వెళ్లాయో అంతా తనకు తెలుసన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ ఈ సందర్భంగా శైలజకు రంగారావు హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ అని, కరప్షన్‌ కింగ్‌ అని రాయపాటి రంగారావు తెలిపారు. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్‌ అని విమర్శించారు. ఇప్పుడు లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడన్నారు. పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్‌ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడని ఆయన తెలిపారు.

First Published:  14 Jan 2024 2:55 AM GMT
Next Story