Telugu Global
Andhra Pradesh

రామోజీరావు చిన్న బుర్రకు అది తట్టలేదా..?

డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ను మార్ట్‌గేజ్‌ బాండ్‌గా చూపిస్తూ దానికి 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కట్టాలనే లెక్క వేసి ప్రజలను మాయ చేయాలని రామోజీరావు చూశారు.

రామోజీరావు చిన్న బుర్రకు అది తట్టలేదా..?
X

ఈనాడు రామోజీరావుకు ఆ మాత్రం తెలియదా..? తెలిసీ ఈనాడులో తప్పుల తడకలతో వార్తాకథనాలను రాయించడం వెనక అసలు కథ అందరికీ తెలిసిందే. ఎలాగైనా తన శిష్యుడు నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కట్టబెట్టాలని చూడడమే ధ్యేయంగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ‘చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు’ అనే వార్తాకథనాన్ని అచ్చేయించారు.

చిన్న పరిశమ్రలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్‌ చార్జీల మీద కనీస అవగాహన లేకుండా లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ ఆ వార్తకథనం అచ్చు వేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి పెనుభారం మోపారని వాపోయారు. వాస్తవానికి మార్ట్‌గేజ్‌ బాండ్‌కు చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో ఏ విధమైన మార్పు కూడా జరగలేదు. అయినప్పటికీ 25 రెట్లు పెరిగిందని రామోజీ ఈనాడు అబద్ధంతో వార్తాకథనాన్ని అచ్చేసింది. ఎలా పెరిగాయో మాత్రం చెప్పలేకపోయింది.

డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ను మార్ట్‌గేజ్‌ బాండ్‌గా చూపిస్తూ దానికి 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కట్టాలనే లెక్క వేసి ప్రజలను మాయ చేయాలని రామోజీరావు చూశారు. ఒక పరిశ్రమ తీసుకునే రుణం ఎన్ని కోట్లు ఉన్నా డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ దస్తావేజుకు చెల్లించే స్టాంప్‌ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వేయి రూపాయల స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. అయితే, 25 శాతం భారం ఎక్కడ వేసినట్లు అనే ప్రశ్నను రామోజీరావు వేసుకోలేదు. దానికి సంబంధించిన కనీస అవగాహన కూడా రామోజీకి లేదనుకోవాలా?

First Published:  19 Feb 2024 12:08 PM GMT
Next Story