Telugu Global
Andhra Pradesh

రైతు భరోసా కేంద్రాలపై ఇంతగా బొంకనేల రామోజీరావు..?

అడిగిన ప్రతిరైతుకు కూడా సర్టిఫైడ్‌ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ-క్రాప్‌ బుకింగ్‌, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు సజావుగా సాగుతున్నాయి.

రైతు భరోసా కేంద్రాలపై ఇంతగా బొంకనేల రామోజీరావు..?
X

రైతు భరోసా కేంద్రాలపై రామోజీరావు ఈనాడు ప‌త్రిక తప్పుల తడక వార్తాకథనాన్ని ప్రచురించింది. తన తప్పుడు కథనాలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అప్రతిష్టపాలు చేసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మేలు చేయాలని చూస్తున్నారు. గ్రామాలకు వెళ్లి చూస్తే రామోజీరావుకు ఆర్బీకేలు వర్థిల్లుతున్న వైనం అర్థమై ఉండేది. ‘రైతు సేవల వట్టిదే.. భరోసా దక్కదే..’ అంటూ రామోజీరావు ఆడిపోసుకోవడం వెనక కుట్ర తప్ప మరేమీ లేదు.

ఆర్బీకేల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని రామోజీరావు రైతులపై కపట ప్రేమను ప్రదర్శించారు. నిజానికి, గ్రామస్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బంది ఉన్నారు. దానికి తోడు 1,573 మంది ఎంపీవోలు సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకే సెంట‌ర్‌కు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు.

సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్‌ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి 1,896 మంది అవసరమని గుర్తించి, ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారు. ఆ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేశారు. ఎంపికైనవారికి అపాయింట్‌మెంట్ కాపీలు పంపిస్తున్నారు.

అడిగిన ప్రతిరైతుకు కూడా సర్టిఫైడ్‌ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ-క్రాప్‌ బుకింగ్‌, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. వారిపై అదనపు బాధ్యతలు మోపడం లేదు. వాస్తవాలను గ్రహించకుండా రామోజీరావు తప్పుడు ఆరోపణలు చేశారు.

సచివాలయ శాఖ నుంచి సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోట్లకు బదిలీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఆర్బీకేలకు 526 గ్రామాల్లో సొంత భవనాలున్నాయి. మరో 10,252 గ్రామాల్లో రూ.2.260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1019.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలినవాటిని మార్చిలోగా పూర్తి చేయాలని సంకల్పించారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్‌ సమాచారం తెలుసుకునేందుకు 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను, వాటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌ బోర్డును ఏర్పాటు చేశారు.

అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే మార్చి వరకు అద్దెలకు సర్దుబాటు చేయడానికి మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పెండింగ్‌లో ఉన్న కరెంట్‌ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల‌య్యాయి. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపులకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్‌ శాఖకే కేటాయించే విధంగా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేశారు. స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బంది ఖాతాల్లోకి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేశారు.

స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులను చందాదారులుగా చేర్చే కార్యక్రమం చేపట్టారు. అయితే వాటి కోసం సిబ్బందికి ఏ విధమైన టార్గెట్లు పెట్టలేదు. ఆర్బీకేలపై రామోజీరావు పిసరంత నిజం కూడా చెప్పలేదు.

First Published:  12 Feb 2024 8:10 AM GMT
Next Story