Telugu Global
Andhra Pradesh

జగన్ మీద కోపం అవినాష్ మీదా?

‘అవినాష్ రెడ్డికేనా హక్కులు’ అనే హెడ్డింగ్‌తో ఎల్లో మీడియాలో పెద్ద కథనం వచ్చింది. అందులో జగన్ మీద కోపాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద చూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు ముందుకు సాగ‌కుండా సీబీఐకి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారట.

జగన్ మీద కోపం అవినాష్ మీదా?
X

‘అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు’ అనే సామెత రామోజీరావుకు సరిగ్గా సరిపోతుంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బలు రామోజీరావు మీద ఎంత తీవ్రంగా పడుతోందో అర్థ‌మైపోతోంది. ‘అవినాష్ రెడ్డికేనా హక్కులు’ అనే హెడ్డింగ్‌తో ఎల్లో మీడియాలో పెద్ద కథనం వచ్చింది. అందులో జగన్ మీద కోపాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద చూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు ముందుకు సాగ‌కుండా సీబీఐకి జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారట.

అడ్డంకులు సృష్టిస్తున్నట్లు రాశారే కానీ ఏ విధంగా అడ్డుపడుతున్నారో రాయలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తూ జనాలకున్న ప్రజాస్వామ్య హక్కులును కాలరాస్తోందట. ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తనీయటంలేదట. వివేకా హత్యకేసు నుండి తప్పించుకునేందుకు అవినాష్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అన్నీ అవకాశాలు ఇతర ప్రజాస్వామ్యవాదులకు కూడా ఉంటుందని జగన్ మరచిపోతున్నారని భోరుమంది.

అవినాష్ కేసుకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముడిపెట్టడం ఏమిటో? ప్రజాస్వామ్యానికి వచ్చిన ముప్పేమిటో అర్థంకావటంలేదు. నిజంగానే ప్రజాస్వామ్యం లేకపోతే జగన్ మీద ఎల్లో మీడియా ఇన్ని తప్పుడు వార్తలు, కథనాలు ఇవ్వగలిగేదేనా? సీబీఐ దర్యాప్తు మీద అవినాష్ అండ్ కో ఆరోపణలు చేయకూడదట. తమను హత్యకుట్రలో ఇరికించటమే టార్గెట్‌గా సీబీఐ వ్యవహరిస్తోందని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేయటంలేదని అవినాష్ ఆరోపించటాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. సీబీఐకి అడ్డంకులు సృష్టించటం ఏమిటంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ రామోజీ మరచిపోయిందేమంటే అవినాష్ కానీ ఇంకెవరైనా కానీ సీబీఐ దర్యాప్తును అడ్డుకోలేదు.

ఇక సోషల్ మీడియాలో కేసులంటే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఎంతో మందిపైన కేసులు పెట్టి అరెస్టులు చేసిన విషయం రామోజీ మరచిపోయారా? సీబీఐని రాష్ట్రంలోకి ఎంటర్ కానీయకుండా బ్యాన్ చేసిన విషయం రామోజీకి గుర్తులేదా? బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా కలవనన్నిసార్లు నరేంద్ర మోడీని జగన్ కలుస్తున్నారట. అలాంటప్పుడు అవినాష్ అండ్ కోను సీబీఐ తప్పుడు కేసుల్లో వేధిస్తుందా అనే పిచ్చి ప్రశ్న వేశారు. మోడీని జగన్ కలుస్తున్నా ఎంపీపై సీబీఐ కేసులు పెట్టిందంటే అవినాష్ విషయంలో మోడీతో జగన్ మాట్లాడటంలేదని ఎల్లో మీడియానే చెప్పినట్లయ్యింది.

ఇంతపెద్ద స్టోరీ ఎందుకు రాశారంటే మార్గదర్శి కేసుల నుంచి తాను తప్పించుకునే అవకాశంలేకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేడో రేపో అరెస్టు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దాని నుంచి తప్పించుకునేందుకే జగన్ మీదున్న కోపాన్ని అవినాష్ మీద చూపించారనే అనుకోవాలి. జగన్, అవినాష్ మీద ఎన్ని కథనాలు రాసినా మార్గదర్శి మోసాలపై పెట్టిన చీటింగ్ కేసులు వీగిపోతాయా?

First Published:  24 April 2023 5:44 AM GMT
Next Story