Telugu Global
Andhra Pradesh

రామోజీ, రాధాకృష్ణ.. చంద్రబాబుకి గురువులు

వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ రావు, రాధాకృష్ణ.. చంద్రబాబుకి గురువులు అని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

రామోజీ, రాధాకృష్ణ.. చంద్రబాబుకి గురువులు
X

వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ రావు, రాధాకృష్ణ.. చంద్రబాబుకి గురువులు అని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువులు అనే పదాన్ని కించపరిచేలా ఈరోజు చంద్రబాబు ట్వీట్లు పెట్టారని మండిపడ్డారు. ఆయన హయంలో విద్యారంగానికి ఏం చేశారో రెండు ముక్కలు చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు బొత్స. ఇవన్నీ తాము గర్వంగా చెప్పుకుంటామని, చంద్రబాబు చెప్పుకోడానికి ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం మన ఖర్మ అని అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకున్నామని, టీడీపీ నేతలకు ఇది మింగుడుపడని వ్యవహారంగా మారిందని అన్నారు మంత్రి బొత్స. ఒక పండుగ లాంటి రోజు కూడా టీడీపీ నేతలు రాజకీయ ఉపన్యాసాలిస్తూ గురువును అవహేళన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి మానవత్వం, విలువలు లేవని, ఆయన దిగజారిపోయారని మండిపడ్డారు బొత్స.

చంద్రబాబు ఏమన్నారంటే..?

గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ఏపీలో టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపుకి పాల్పడుతోందంటూ ట్వీట్ చేశారు. జీతాలు సక్రమంగా ఇవ్వడంలేదని, సీపీఎస్ రద్దుకోసం పోరాటం చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారని, పాఠశాలల విలీనం పేరిట గ్రామీణ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సెప్టెంబర్-5 చంద్రబాబు ఇష్టపడే రోజు కాదని, ఆయనకు వెన్నుపోటు పొడిచిన రోజంటే ఇష్టం అని చెప్పారు బొత్స. టీచర్స్ డే రోజున చంద్రబాబు చేసిన చీటింగ్ వ్యాఖ్యలు వెన్నుపోటు పొడిచిన రోజున మాట్లాడుకోవాలని హితవు పలికారు.

First Published:  5 Sep 2022 1:20 PM GMT
Next Story