Telugu Global
Andhra Pradesh

అచ్చం నా ఫొటోలాగే..! పవన్ పై వర్మ సెటైర్

హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న పవన్ ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నడిరోడ్డుపై పడుకుని సీన్ క్రియేట్ చేశారు. ఈ సీన్ అచ్చు తన సినిమాలోని సీన్ ని పోలి ఉందంటున్నారు వర్మ.

అచ్చం నా ఫొటోలాగే..! పవన్ పై వర్మ సెటైర్
X

చంద్రబాబు ఎపిసోడ్ టీడీపీ వాళ్లకు బాధగా ఉంటే, వైసీపీ వాళ్లకు మాత్రం మాంచి వినోదాన్ని పంచుతోంది. అందులోనూ వర్మ లాంటి వాళ్లు ఓ రేంజ్ లో సెటైర్లతో సోషల్ మీడియాని నింపేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తోపాటు, పవన్ కల్యాణ్ ని ఏపీ పోలీసులు అడ్డుకోవడం, వర్మకు మంచి స్టఫ్ అందించింది. విచిత్రం ఏంటంటే.. పవన్ కల్యాణ్ రోడ్డుపై పడుకున్న సీన్ ని గతంలోనే వర్మ తన సినిమాకోసం చిత్రీకరించడం.


అవును, ఇది నిజం. వ్యూహం సినిమాకోసం పవన్ కల్యాణ్ పాత్రపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు రామ్ గోపాల్ వర్మ. అందులో పవన్ నేలపై పడుకుని కాలుపై కాలు వేసుకుని ఉన్న సీన్ ఒకటి ఉంటుంది. అది రీల్ లైఫ్ సీన్, రియల్ లైఫ్ లో కూడా పవన్ ఇలాంటి సీన్ ని రక్తి కట్టించారని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న పవన్ ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నడిరోడ్డుపై పడుకుని సీన్ క్రియేట్ చేశారు. ఈ సీన్ అచ్చు తన సినిమాలోని సీన్ ని పోలి ఉందంటున్నారు వర్మ.

చంద్రబాబు మ్యారేజ్ డే పై వర్మ పంచ్..

ఇక చంద్రబాబు మ్యారేజ్ డే పై కూడా వర్మ అదిరిపోయే పంచ్ విసిరారు. వివాహం తర్వాత జీవితం అంటే జైలు జీవితం అనే అర్థం ఉందని, ఆ జైలు నుంచి ఇప్పుడు నిజమైన జైలుకి చంద్రబాబు వెళ్లారని, అది కూడా ఆయన పెళ్లిరోజే ఈ జైల్ టు జైల్ ప్రోగ్రామ్ జరగడం విశేషం అని ట్వీట్ చేశారు వర్మ. దీన్ని విధి విసిరిన చెంపదెబ్బగా, కర్మ ఫలంగా అభివర్ణించారు.



First Published:  10 Sep 2023 3:30 PM GMT
Next Story