Telugu Global
Andhra Pradesh

ఏడుపుగొట్టు నాయకుల్ని ఎవరూ పట్టించుకోరు..

రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసి నారా క్రై ఫ్యామిలీ అంటూ పంచ్ లు విసిరారు. ఏడ్చే నాయకుల్ని ఎవరూ నమ్మరని తేల్చి చెప్పారు.

ఏడుపుగొట్టు నాయకుల్ని ఎవరూ పట్టించుకోరు..
X

ఇటీవల టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ లో నారా లోకేష్ కంటతడి పెట్టారంటూ ఎల్లో మీడియా హోరెత్తిపోయింది. తండ్రిని తలచుకుని లోకేష్ కంటతడి అంటూ హైప్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ కంటతడి నెగెటివిటీ మూటగట్టుకుంది. అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్ అంటూ ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసి నారా క్రై ఫ్యామిలీ అంటూ పంచ్ లు విసిరారు. ఏడ్చే నాయకుల్ని ఎవరూ నమ్మరని తేల్చి చెప్పారు.


తన భార్యని ఎవరో ఏదో అన్నారని అప్పుడు చంద్రబాబు ఏడ్చారు, తండ్రి జైలులో ఉన్నాడని ఇప్పుడు కొడుకు లోకేష్ ఏడుస్తున్నారు. మా కుటుంబానికి ఈ బాధలేంటా అని తల్లి, భార్య కూడా ఏడుస్తున్నారు.. ఇలాంటి ఏడుపుగొట్టు ఫ్యామిలీని ప్రజలు ఎందుకు నమ్ముతారు. బలమైన నాయకులనే ప్రజలు కోరుకుంటారు కానీ ఏడ్చేవాళ్లని కాదు అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఏడుస్తూ పోతే వారు నవ్వడానికి కూడా సందర్భాలు రావు అని తేల్చి చెప్పారు.

ఫలించని సెంటిమెంట్ అస్త్రం..

నాయకుడు ఏడిస్తే ప్రజలు ఏమనుకుంటారు..? సెంటిమెంట్ ఫలించి సింపతీ లభిస్తుందని అనుకున్నారు గతంలో చంద్రబాబు. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని ఆశించారు. అందుకే మీడియా ముందు భోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. సీన్ కట్ చేస్తే.. చంద్రబాబుని సోషల్ మీడియాలో అందరూ చడామడా తిట్టారు. నలభయ్యేళ్ల రాజకీయ చరిత్ర అని గొప్పలు చెప్పుకునే నాయకుడు ఇలా మీడియా ముందు ఏడవడం ఏంటని పెదవి విరిచారు. ఆ ఘటనతో సింపతీ రాకపోగా.. చంద్రబాబు సీన్ అయిపోయిందని అందరూ డిసైడ్ కావడం విశేషం. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి అరెస్ట్ అయ్యాక ఏమీ చేయలేని స్థితిలో ఏడుస్తున్నారని అర్థమైపోయింది. అందుకే నారా క్రై ఫ్యామిలీ అంటూ వర్మలాంటి వాళ్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తామంటున్న నాయకులే ఇలా ఏడుస్తూ సింపతీ కోసం ట్రై చేస్తుంటే.. ఆ ఏడుపుల్ని పట్టించుకోవడం కూడా జనం మానేశారు.


First Published:  24 Oct 2023 5:41 AM GMT
Next Story