Telugu Global
Andhra Pradesh

పవన్‌కు నాదెండ్ల, చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారు.. వర్మ ట్వీట్

పవన్ ని నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్‌కు నాదెండ్ల, చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారు.. వర్మ ట్వీట్
X

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు రాంగోపాల్ వ‌ర్మ కేరాఫ్‌గా నిలుస్తుంటారు. ఆయ‌న చేసే ఏ వ్యాఖ్య అయినా వివాద‌మే. ఇటీవల తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్న వర్మ మరోసారి పవన్ ని టార్గెట్ చేశాడు. పవన్ ని నాదెండ్ల మనోహర్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

'ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్లభాస్కర్ రావు, ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే, ఈసారి పవన్ కళ్యాణ్ ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు' అని వర్మ ట్వీట్ చేశాడు.


Advertisement

అయితే రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ కి జన సైనికులు కూడా ఘాటుగా రిప్ల‌య్ ఇస్తున్నారు. 'నాకు దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడే లేడు అని అంటావు. మళ్లీ దేవుడే కలలో చెప్పాడు అంటున్నావు. వోడ్కాలో నీళ్లు తక్కువ అయినట్టు ఉన్నాయి చూసుకో వర్మ ' అని ఒక నెటిజన్ రిప్ల‌య్‌ ఇవ్వగా.. మరో నెటిజన్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వెన్నుపోట్ల గురించి మాత్రమే దేవుడు కలలో కనిపించి చెబుతాడా? అని వర్మను ప్రశ్నించాడు.

వర్మను ఎర్రగడ్డలోని పిచ్చాసుపత్రిలో చేర్చినట్లు కల వచ్చిందని పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. కాగా నాదెండ్ల మనోహర్ పై వర్మ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇటువంటి విమర్శలే చేశాడు. జనసేన పార్టీలో నెంబర్.2 గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ గతంలో వ్యాఖ్యలు చేశాడు.


► Read latest Andhra Pradesh News and Telugu News

► Follow us on Facebook , Twitter & Google News

Next Story