Telugu Global
Andhra Pradesh

రాహుల్‌ను కలుస్తా.. రీఎంట్రీపై టైం వచ్చినప్పుడు చెబుతా

ప్రస్తుతం ఇంకా తన రాజకీయ సెలవు కొనసాగుతోందని చెప్పిన రఘువీరా.. గతంలో తనకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన రాహుల్ గాంధీ పాదయాత్రగా తమ ప్రాంతానికి వస్తున్నప్పుడు కలిసి సంఘీభావం తెలపడం కనీన మర్యాద అని చెప్పారు.

రాహుల్‌ను కలుస్తా.. రీఎంట్రీపై టైం వచ్చినప్పుడు చెబుతా
X

రాహుల్ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించగానే ఆయన్ను వెళ్లి కలుస్తానని ప్రకటించారు మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. గత మూడేళ్లుగా ఆయన సొంతూరు నీలకంఠాపురంలోని గుడి నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనబోనని ఇది వరకే ప్రకటించారు.

ప్రస్తుతం ఇంకా తన రాజకీయ సెలవు కొనసాగుతోందని చెప్పిన రఘువీరా.. గతంలో తనకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన రాహుల్ గాంధీ పాదయాత్రగా తమ ప్రాంతానికి వస్తున్నప్పుడు కలిసి సంఘీభావం తెలపడం కనీన మర్యాద అని చెప్పారు. నీలకంఠాపురంలో నిర్మించిన ఆలయం నుంచి వస్త్రం, తీర్థప్రసాదాలు తీసుకెళ్లి రాహుల్‌ గాంధీకి అందజేస్తానని గ్రామస్తులకు ఆయన వివరించారు.

తాను రాజకీయాలకు ఇప్పటికీ దూరంగానే ఉన్నానని.. రాహుల్‌ గాంధీని కలవడం కేవలం మర్యాదపూర్వకమేనని వెల్లడించారు. రాజకీయాల్లోకి మళ్లీ వస్తానా.. లేదా.. అన్న దానిపై సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని ప్రకటించారు. 30ఏళ్ల పాటు తనతో రాజకీయంగా నడిచిన వారు ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్నారని.. వారందరినీ తాను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానన్నారు.

Next Story