Telugu Global
Andhra Pradesh

'క్విట్ జగన్.... సేవ్ ఆంధ్రప్రదేశ్' - చంద్ర‌బాబు

జ‌గ‌న్ ముంద‌స్తుకి వెళితే రాష్ట్రానికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంది అని రాష్ట్ర కమిటీ సమావేశం లో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు అన్నారు

క్విట్ జగన్.... సేవ్ ఆంధ్రప్రదేశ్ - చంద్ర‌బాబు
X

సీఎం జ‌గ‌న్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు పేర్కొన్నారు. మంగ‌ళ‌గిరి టిడిపి కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం టిడిపి రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడారు. టిడిపి ఆవిర్భ‌వించి 40 ఏళ్లు పూర్తి చేసుకుంద‌ని, ఈ శుభసంద‌ర్భంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్నామ‌ని, నేను ముఖ్యమంత్రిగా మొదటి సారి పదవి చేపట్టి 27 ఏళ్లు అయ్యింద‌ని...ఈ ప్ర‌స్థానంలో విజ‌యాలు ఎప్ప‌టికీ గుర్తుంటాయ‌న్నారు. రాష్ట్రంలో సంక్షేమం అనేది మొదట పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కొనియాడారు. కిలో 2 రూపాయ‌ల బియ్యంతో ఆహార భద్రత, పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం ఎన్టీఆర్ చేప‌ట్టార‌ని వివ‌రించారు.

నేటి రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నామ‌ని, నేడు ఎక్కడ చూసినా విద్వేషమే....పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల సమస్యలను ప్రస్తావిస్తే..దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 27 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు..ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. చింతూరులో వరదల సమయంలో సిఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూవచ్చి చనిపోయిందని, క‌నీస వైద్యం అందించ‌లేని సీఎం దీనిపై ఏం స‌మాధానం చెబుతార‌ని నిల‌దీశారు.

విదేశీ విద్యను ఆపేశారు....బిసిలకు ఒక్క పథకం లేదు.. కాపు కార్పొరేషన్ కు నిధులు లేవు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క...భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారని తెలిపారు. చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు...ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నాయ‌న్నారు.

ఈ స‌మావేశంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఇన్‌చార్జులు, నేత‌లు పాల్గొన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా సిద్ధంగా వుండాల‌ని, .నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాల‌ని, నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలని, క్విట్ జగన్.... సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అమల్లోకి తేవాలని ఆదేశించారు.


ప‌నిచేయ‌నివారిని సాగ‌నంపే స‌మ‌యం ఆస‌న్న‌మైంది

ఇంకా పనితీరు మెరుగుపడని కొందరు తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో నిర్ణయాలు తీసుకునే సమయం ఆస‌న్న‌మైంద‌ని టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు పంపారు. టిడిపి రాష్ట్ర స‌మ‌న్వ‌య స‌మావేశంలో పార్టీ నేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన సంకేతాలు పంపారు అధినేత‌. ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న‌పై పోరాడుతూ నేను రాష్ట్ర‌మంతా గట్టిగా తిరుగుతున్నాను, మరో వైపు కార్యకర్తలు పోరాడుతున్నారు, కానీ కొంద‌రు నేత‌లు అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు నివేదిక‌ల ద్వారా తెలుస్తోంద‌న్నారు. మహానాడు కు క్యాడర్ ఎలా వచ్చారో చూశామ‌ని, ప్ర‌భుత్వం ప‌ట్ల ప్రజల్లో, క్యాడర్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలున్నాయ‌ని పేర్కొన్నారు. కానీ కొందరు నేతలు ఇంకా తమ పని కూడా తాము చెయ్యడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ ఇన్‌చార్జి హోదా ఇచ్చినప్పుడు ఎందుకు కార్యక్రమాలు చెయ్యడం లేదని ప్ర‌శ్నించారు. నేతలు పనితీరు మెరుగుపరుచుకుంటారని మూడున్నర ఏళ్లుగా చూశానని, ఇంకా ఎదురు చూసేది లేదని స్ప‌ష్టం చేశారు. ప‌నితీరు మెరుగుప‌రుచుకోని నేత‌ల‌పై ఒక నిర్ణ‌యం తీసుకుని స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. గతంలో ప్రకటించినట్లు 40 శాతం సీట్లు యువత కు ఇస్తామ‌ని మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు చంద్ర‌బాబు.

First Published:  2 Sep 2022 11:33 AM GMT
Next Story