Telugu Global
Andhra Pradesh

అమిత్ షా పిలిచారా..? లోకేష్ బతిమిలాడారా..? పురందేశ్వరి ఏమన్నారంటే..?

లోకేష్‌ ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగి మరీ ఆయన వద్దకు వెళ్లారా..? ఇందులో ఏది నిజం, ఎంత నిజం అనే విషయంపై.. ఆ భేటీలో పాల్గొన్న పురందేశ్వరి స్పందించారు.

అమిత్ షా పిలిచారా..? లోకేష్ బతిమిలాడారా..? పురందేశ్వరి ఏమన్నారంటే..?
X

అమిత్ షా - లోకేష్ భేటీ జరిగి రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ విషయం చర్చనీయాంశంగానే ఉంది. అమిత్ షా యే తనను పిలిపించుకున్నారని లోకేష్ చెప్పడం విశేషం. కాదు కాదు, లోకేషే నెలరోజులకు పైగా బతిమిలాడుకుంటే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇందులో ఏది నిజం, ఎంత నిజం అనే విషయంపై.. ఆ భేటీలో పాల్గొన్న పురందేశ్వరి స్పందించారు.

అమిత్ షా-లోకేష్ భేటీపై పురందేశ్వరి తనదైన శైలిలో స్పందించారు. లోకేష్‌ ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగి మరీ ఆయన వద్దకు వెళ్లారా..? అనేది అప్రస్తుతం అన్నారు పురందేశ్వరి. వారిద్దరి మధ్య భేటీ జరిగిందనేది వాస్తవమే కదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని వెల్లడించారు. కిషన్ రెడ్డి ద్వారా తనకు కబురు పెట్టారని లోకేష్ చెప్పారని, ఆ విషయంపై కిషన్ రెడ్డి స్పందిస్తేనే బాగుంటుందన్నారు పురందేశ్వరి.

చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు పురందేశ్వరి. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనేది తమ అభిప్రాయమని మరోసారి తేల్చి చెప్పారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనన్నారు.

జగన్ రాజీనామాకు డిమాండ్..

మద్యంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోని జగన్ రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు పురందేశ్వరి. మద్య నిషేధం అమలు చేస్తామని సంతకం పెట్టి మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టిన మాట నిజం కాదా..? అని ప్రశ్నించారు.

First Published:  14 Oct 2023 2:04 PM GMT
Next Story