Telugu Global
Andhra Pradesh

సాల్వే కూడా చేతులెత్తేశాడా?

ఇక్కడ విషయం ఏమిటంటే స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ తెప్పించేందుకు సాల్వే వర్చువల్ పద్ధ‌తిలో లండన్ నుండి ఎంతసేపు వాదించినా ఉపయోగం లేకపోయింది.

సాల్వే కూడా చేతులెత్తేశాడా?
X

ఎంత పేరున్న లాయర్లు అయితేనేమి, ఎంత ఖరీదైన లాయర్లు అయితేనేమి? కేసులో దమ్ములేన‌ప్పుడు.. విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు తరపున హైకోర్టులో మరో ప్రముఖ, అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకళ్ళయిన హరీష్ సాల్వే వాదించారు. ఆయన వాదనలు విన్నతర్వాత ఎక్కడా పసలేదని తేలిపోయింది. ఇప్పటికే చంద్రబాబు తరపున సిద్దార్థ‌ లూథ్రా ఏసీబీ కోర్టులో, హైకోర్టులోనూ వాద‌న‌లు వినిపించి ఫెయిలైన విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా చంద్రబాబు తరపున ఒక కేసులో బెయిల్, మరో కేసులో ఇంటెరిమ్ బెయిల్, మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటీషన్లను లాయర్లు దాఖలు చేశారు. అయితే అన్నీ వాయిదాపడ్డాయి. అంటే ఒక్క కేసులో కూడా చంద్రబాబు ఆశించిన ఫలితం దక్కలేదని అర్థ‌మవుతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ తెప్పించేందుకు సాల్వే వర్చువల్ పద్ధ‌తిలో లండన్ నుండి ఎంతసేపు వాదించినా ఉపయోగం లేకపోయింది.

విషయం ఏమిటంటే సాల్వే వాదనల్లో ఏ మాత్రం పసకనబడలేదు. అన్నీ పాత వాదనలే వినిపించారు. పాత వాదనలే అంటే ఇంతకుముందు లూథ్రా వాదించిన పాయింట్లనే ఎక్కువ వినిపించారు. అవేమిటంటే చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదట. తాను అరెస్టయ్యేంతవరకు స్కిల్ స్కామ్ కేసు విచారణ జరుగుతోందని చంద్రబాబుకు తెలియదట. స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేనేలేదట. పైగా చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ సాక్ష్యాలు పుట్టిస్తోందట.

దేశంలోనే అత్యంత ప్రముఖ లాయర్లలో ఒకరైన సాల్వే ఇలాంటి వాదనలు వినిపించారంటేనే అర్థ‌మైపోతోంది కేసులో దమ్ములేదని. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరంలేదని ఏసీబీ కోర్టులోనే తేలిపోయింది. స్కిల్ స్కామ్ విచారణ జరుగుతోందని చంద్రబాబుకు తెలియ‌ద‌ని చెప్పటమూ అబద్ధమే. ఎందుకంటే ఇదే స్కామ్‌లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ అరెస్టయ్యారు. అలాగే సుమంత్ బోస్, ఖన్వేల్కర్‌తో పాటు మరో నలుగురు అరెస్టయ్యారు.

ఇంతమంది అరెస్టయిన తర్వాత కూడా స్కామ్‌పై దర్యాప్తు జరుగుతోందని చంద్రబాబుకు తెలియ‌దంటే ఎవరైనా నమ్ముతారా? సెక్షన్ 17 ఏ లో సవరణలు వచ్చాయి కాబట్టి ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించవని సాల్వే వాదించారు. అయితే చంద్రబాబు మీద కేసు పెట్టేనాటికి 17 ఏ సెక్షన్‌కు సవరణలు జరగలేదు కాబట్టి సాల్వే వాదనలు చెల్లవని ప్రభుత్వ లాయర్ వాదించారు. సాల్వే వాదనను ప్రభుత్వం తరపున వాదించిన లాయర్లు ముఖుల్ రోహిత్గి, పొన్నవోలు సుధాకరరెడ్డి చీల్చి చెండాడారు. జీవోలు, ఒప్పందాలు, సంతకాలు, నిధులు విడుదల తదితరాలతో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కున్న తర్వాత ఎంతపెద్ద లాయర్ అయినా ఏమిచేయగలరు?

First Published:  20 Sep 2023 5:24 AM GMT
Next Story