Telugu Global
Andhra Pradesh

చంద్రబాబే కాదు కదా..!టాలీవుడ్ ఘాటు రియాక్షన్

చిత్ర పరిశ్రమకు చంద్రబాబు సహా చాలామంది మఖ్యమంత్రులు మంచి చేశారని, సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం సెన్సిటివ్ ఇష్యూ అన్నారు.

చంద్రబాబే కాదు కదా..!టాలీవుడ్ ఘాటు రియాక్షన్
X

చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ వ్యవహారంపై కొంతమంది పాజిటివ్ గా స్పందించారు, చాలామంది పాపం పండింది అంటూ కౌంటర్లిచ్చారు. అయితే టీడీపీ అనుకూల మీడియా పాజిటివ్ రియాక్షన్లను హైలైట్ చేస్తూ హడావిడి చేస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ నేరుగా స్పందించలేదు. టీడీపీతో బంధం బాగా ఉన్న రాఘవేంద్రరావు వంటి దర్శకులు, ఒకరిద్దరు నటీనటులు మాత్రం బాధపడ్డారు. అసలు ఇండస్ట్రీ అంతా ముక్త కంఠంతో ఈ అరెస్ట్ ను ఎందుకు ఖండించలేదని సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు దెప్పిపొడుస్తున్నారు. ఈ విమర్శలకు అంతే ధీటుగా బదులిచ్చారు నిర్మాత సురేష్ బాబు.

ఎందుకు ఖండించాలి..?

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. ఆంధ్రా తెలంగాణ గొడవలప్పుడు కూడా ఇండస్ట్రీ స్పందించలేదని ఆయన గుర్తు చేశారు.‌ ఇప్పుడు కూడా స్పందిచలేదని, స్పందించబోదని చెప్పారు. చిత్రపరిశ్రమకు చంద్రబాబు సహా చాలామంది మఖ్యమంత్రులు మంచి చేశారని, సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. అంతమాత్రాన ఈ అరెస్ట్ ని ఖండించాలని రూల్ ఏముందని ప్రశ్నించారు.

అంత గ్యాప్ ఏంటి..?

దగ్గుబాటి కుటుంబానికి టీడీపీతో సత్సంబంధాలే ఉన్నాయి. రామానాయుడు టీడీపీ తరపున ఎంపీగా పనిచేశారు కూడా. సురేష్ బాబు కూడా టీడీపీ కోసం పనిచేశారు. సురేష్ బాబు తనయుడు రానా.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్ర పోషించారు. దగ్గుబాటి కుటుంబానికి విశాఖలో చంద్రబాబు ప్రభుత్వం గతంలో స్టూడియో కోసం భూములు కేటాయించింది. అయినా కూడా సురేష్ బాబు.. బాబు అరెస్ట్ ని పట్టించుకోలేదంటే.. అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టడం ఎందుకు.. అనుకున్నట్టే లెక్క. ప్రస్తుత సీఎం జగన్ తో కూడా టాలీవుడ్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక ప్రదర్శనల విషయంలో ఏపీ నుంచి సానుకూల స్పందనలే ఉన్నాయి. అందుకే అందరు సీఎంలు ఇండస్ట్రీకి మంచి చేశారని చెప్పుకొచ్చారు సురేష్ బాబు. ప్రత్యేకంగా చంద్రబాబుని వెనకేసుకు రావాలనుకోలేదు.


First Published:  19 Sep 2023 9:48 AM GMT
Next Story