Telugu Global
Andhra Pradesh

గోరంట్ల మాధవ్ వీడియోపై రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు..

ఇప్పటికే గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో ఏపీలో జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది. దాదాపుగా ప్రభుత్వం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నా, ప్రతిపక్షం మాత్రం తగ్గడంలేదు. ఢిల్లీ స్థాయిలో మాధవ్ వీడియో వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది.

గోరంట్ల మాధవ్ వీడియోపై రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు..
X

గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం అందరూ మరచిపోయారని అనుకుంటున్న దశలో సడన్ గా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీకి ఓ లేఖ అందింది. మాధవ్ వీడియో వ్యవహారంపై తమకు ఫిర్యాదు వచ్చిందని, దాని సంగతేంటో చూడాలని ఆ లేఖలో రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. దీంతో మరోసారి ఏపీలో మాధవ్ వీడియో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఢిల్లీలో ఏం జరిగింది.?

ఇప్పటికే గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో ఏపీలో జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది. దాదాపుగా ప్రభుత్వం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నా, ప్రతిపక్షం మాత్రం తగ్గడంలేదు. ఢిల్లీ స్థాయిలో మాధవ్ వీడియో వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ జేఏసీ పేరుతో కొంతమంది మహిళా నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి నేరుగా ఫిర్యాదు చేశారు, జాతీయ మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు ఇచ్చారు. అటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ కి కూడా వేర్వేరుగా ఫిర్యాదులందాయి. వీటిపై తొలిసారిగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం విశేషం. ఈ నెల 23న మహిళా జేఏసీ నేతలంతా రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారని.. ఆ కాపీని ఏపీ సీఎస్‌ కు పంపుతున్నట్టు పేర్కొన్నారు. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు. ఏపీ సీఎస్ కు లేఖ వచ్చిన విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ మేరకు మహిళా జేఏసీ కన్వీనర్‌ చెన్నుపాటి కీర్తికి ఓ అక్నాలడ్జ్ మెంట్ వచ్చింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సీఎస్ ఏం చెబుతారు..?

అది ఒరిజినలా, ఫేకా అనేది తేల్చేందుకు అసలు వీడియో లేదంటున్నారు పోలీసులు. సీఐడీ అధిపతులు కూడా జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపకుండానే అది ఫేక్ అని తేల్చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఓ ప్రైవేట్ ల్యాబ్ కి పంపించి రిపోర్ట్ తెప్పించానంటోంది, అసలా రిపోర్టే సరికాదని సీఐడీ అంటోంది. వైసీపీ నేతలు మాత్రం గతంలో చంద్రబాబు నోట్ ఫర్ ఓట్ కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి మరో ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. సరైన కోణంలో విచారణ జరపకుండా మాధవ్ కి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతానికి మాధవ్ వ్యవహారం పాత వార్తే అయినా, రాష్ట్రపతి కార్యాలయం స్పందనతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. మరి ఏపీ సీఎస్ ఏమని సమాధానం పంపుతారో చూడాలి.

First Published:  30 Aug 2022 2:04 AM GMT
Next Story