Telugu Global
Andhra Pradesh

ప్రజాగర్జన ఫెయిలైందా ? ..మరీ ఇంత అక్కసా ?

వైసీపీ ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియాకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రజాగర్జన ఫెయిలైందా ? ..మరీ ఇంత అక్కసా ?
X

వైసీపీ ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియాకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లుగాను ఎల్లోమీడియా, టీడీపీ చిత్రీకరిస్తుంటుంది. ఇపుడిదంతా ఎందుకంటే అదికార వికేంద్రీకరణ, మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో ప్రజాగర్జన పేరుతో భారీ ర్యాలీ, బహిరంగసభ జరిగింది. మొదటినుండి ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సినంత కవరేజి ఎల్లోమీడియా ఇవ్వలేదు.

సరే మంత్రులు, పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రజాగర్జన బ్రహ్మాండం అనిపించేట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్లే ప్రజాగర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. ఒకవైపు జోరున వర్షం కురుస్తున్నా అన్ని వేలమంది విశాఖనగరంలోని రామకృష్ణా బీచ్ రోడ్డుకు వచ్చారంటేనే ర్యాలీ, సభ రెండూ సక్సెస్ అయినట్లే. జనాల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలనే బలమైన కోరిక లేకపోతే ప్రభుత్వం లేదా వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి పెట్టినా జనాలు హాజరుకారు.

ఈ విషయాన్నే టీడీపీ, ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నట్లుంది. ప్రజాగర్జన ఫెయిలైందని చెప్పటానికి నానా అవస్తలు పడ్డారు. ఎల్లోమీడియాలో బ్యానర్ వార్తగా కానీ కథనంగా కానీ ఎక్కడా కనబడలేదు. ఒక పత్రికలో అయితే బ్యానర్ గా చిన్న ఇంట్రో ఇచ్చి మిగిలిందంతా లోపలి పేజీల్లో చిన్నదిగా కవర్ చేశారు. ఇక మరో పత్రిక అయితే బ్యానర్ ఇంట్రోలేనే ప్రజాగర్జన ఫెయిల్ అనే చెప్పేసింది. జనాలు లేక ర్యాలీ, సభ వెలవెల పోయిందట.

ప్రజాగర్జన ర్యాలీ, బహిరంగసభను లైవ్లో చూసిన జనాలందరికీ తెలుసు కార్యక్రమం హిట్టయిందో లేకపోతే ఫట్టయిందో. కళ్ళముందు కనబడుతున్న, జనాలందరు చూసిన కార్యక్రమాన్ని కూడా ఫెయిలైందని ఎల్లోమీడియా రాస్తే వార్తలను, కథనాలను జనాలు ఎలా నమ్ముతారు ? జరిగింది జరిగినట్లు రాసి తర్వాత తమ అభిప్రాయాలను వేరేగా రాసుకుంటే జనాలు ఓకే అనుకుంటారు. అలాకాకుండా ప్రజాగర్జన బ్రహ్మాండంగా సక్సెస్ అయిన తర్వాత కూడా ఫెయిలని రాయటాన్నే జనాలు నవ్వుకుంటున్నారు. సక్సెస్ అయిన కార్యక్రమాన్ని కూడా ఫెయిలని రాయటంతోనే ఎల్లోమీడియాకు వైసీపీ అంటే ఎంత అక్కసుందో అర్ధమైపోతోంది.

First Published:  16 Oct 2022 7:59 AM GMT
Next Story