Telugu Global
Andhra Pradesh

కమ్మ కులానికి చెందినవాడే కానీ..!

నిజంగానే చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టేవారు కాదని అన్నారు పోసాని. 151 సీట్ల భారీ మెజార్టీ జగన్ కి వచ్చేది కాదని చెప్పారు.

కమ్మ కులానికి చెందినవాడే కానీ..!
X

ఏపీలో ఉన్నవి క్యాస్ట్ పాలిటిక్స్ అనడంలో అనుమానమేం లేదు. అందుకే చంద్రబాబుకి వత్తాసుగా ఆ సామాజిక వర్గానికి చెందిన మీడియా అంతా ఏకమైంది. జయప్రకాష్ నారాయణ వంటి కుహనా మేధావులు సైతం చంద్రబాబుకి వంత పాడటం వెనక ప్రధాన కారణం 'కులం' మాత్రమే. అయితే చంద్రబాబు కమ్మ కులానికి చెందిన వాడైనా.. వెధవ కాబట్టి తాను సపోర్ట్ చేయనని అంటున్నారు పోసాని కృష్ణ మురళి. తమ కులానికి చెందినవాడు కాబట్టే చంద్రబాబుకి జేపీ మద్దతు ప్రకటించారని మండిపడ్డారు.

జయప్రకాష్ నారాయణ, చంద్రబాబుని సపోర్ట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. జగన్ పాలనలో అభివృద్ధి జరగలేదని, సంక్షేమ పథకాలతో ఏపీ నాశనం అవుతోందని అన్నారు జేపీ. ఏపీ మళ్లీ కోలుకోవాలంటే చంద్రబాబు నాయకత్వం కావాలన్నారు. అప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న జేపీ.. సడన్ గా ఎన్నికల టైమ్ లో బయటకు రావడం, బాబు పాలనపై ప్రశంసలు కురిపించడం, ఆయన మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించడం.. ఇవన్నీ చూస్తుంటే వెనక రామోజీ నాటకం స్పష్టంగా కనపడుతోంది. జేపీని అడ్డు పెట్టుకుని మూడురోజులపాటు ఎల్లో మీడియా బాబుని ఆకాశానికెత్తేసింది. జగన్ పై బురదజల్లాలని చూసింది. మేధావులంతా బాబువైపే ఉన్నారని టముకు వేసింది.

అభివృద్ధి ఏది..?

నిజంగానే చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టేవారు కాదని అన్నారు పోసాని. 151 సీట్ల భారీ మెజార్టీ జగన్ కి వచ్చేది కాదని చెప్పారు. చంద్రబాబు విఫలమయ్యారు కాబట్టే ప్రజలు జగన్ కి అవకాశమిచ్చారని, మరోసారి జగన్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారని అన్నారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. తమ కులానికి చెందినవాడు కాబట్టే చంద్రబాబు అవినీతిపరుడైనా జేపీ మద్దతిచ్చారని చెప్పారు.

First Published:  24 March 2024 12:09 PM GMT
Next Story