Telugu Global
Andhra Pradesh

అచ్చెన్న 'గే'నా..? పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

ఎమ్మెల్యేలతో 'టచ్'లో ఉండటానికి అచ్చెన్న ఏమైనా 'గే'నా..? అని ప్రశ్నించారు పేర్ని నాని. 'టచ్' లో ఉంటే తీసుకుని వెళ్లొచ్చుకదా అని సలహా ఇచ్చారు.

అచ్చెన్న గేనా..? పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
X

"40మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో 'టచ్' లో ఉన్నారు." ఇటీవల టీడీపీ గొప్పగా చెబుతున్న మాటలివి. చంద్రబాబుతో సహా, అచ్చెన్నాయుడు కూడా పదే పదే ఇదే మాట వల్లెవేస్తున్నారు. ఈ 'టచ్'లో ఉండే వ్యవహారంపై అదిరిపోయే సెటైర్ పేల్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎమ్మెల్యేలతో 'టచ్'లో ఉండటానికి అచ్చెన్న ఏమైనా 'గే'నా..? అని ప్రశ్నించారు. 'టచ్' లో ఉంటే తీసుకుని వెళ్లొచ్చుకదా అని సలహా ఇచ్చారు. వైసీపీలో ఇంకా స్క్రాప్ ఎవరైనా ఉన్నారేమో వెతుక్కుని తీసుకెళ్లండి అని అన్నారు పేర్ని నాని. ఈ 'గే' వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో మరింత పొలిటికల్ హీట్ పెంచాయి.

విస్తరణ లేదు, ముందస్తు లేదు..

సీఎం జగన్ రేపు ఎమ్మెల్యేలతో సమీక్ష పెట్టారు. కొత్త మంత్రి వర్గాన్ని ఆయన ప్రకటిస్తారని, లేదా అసలు అసెంబ్లీనే రద్దు చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ ఈ మీటింగ్ పై వార్తలొస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు పేర్ని నాని. రేపు గడప గడప కార్యక్రమంపై సమీక్ష మాత్రమే జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. మంత్రి వర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదని, ఇప్పుడున్న క్యాబినెట్ తోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. మీడియా, సోషల్ మీడియాలో రేటింగ్, వ్యూస్ కోసమే మంత్రి వర్గంలో మార్పు అనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదని, వచ్చే ఏడాది మార్చి తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు పేర్ని నాని.

175లో ఎవరికెన్ని..?

175 స్థానాల్లో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నాడో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. బీజేపీకి ఎన్ని, కాంగ్రెస్ కి ఎన్ని, సీపీఐని తాకట్టు పెట్టిన నారాయణకు ఎన్నిసీట్లు.. అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకి లేదని, అందరూ కట్టకట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు.

కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా..

చంద్రబాబు వై నాట్ పులివెందుల అంటున్నాడని.. చంద్రబాబు, పవన్ కలసి వచ్చినా పర్లేదు, విడివిడిగా వచ్చినా పర్లేదని, పులివెందులలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు పేర్ని నాని. 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే నాలుగు గెలిచి ప్రపంచాన్ని గెలిచినట్లు టీడీపీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసి అద్దె మైకు గాళ్లను పిలిచి మాట్లాడించారని సెటైర్లు పేల్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన పువ్వు గుర్తు వాళ్ళకు సిగ్గు, శరం ఉండదా.. అని ప్రశ్నించారు పేర్ని నాని.

First Published:  2 April 2023 2:02 PM GMT
Next Story