Telugu Global
Andhra Pradesh

ఓటుకు నోటు కాదు, ఓటుకు డ్రగ్స్ ప్యాకెట్..!

డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ట్వీట్ పై కూడా తాము ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు పేర్ని నాని, అది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని చెప్పారు.

ఓటుకు నోటు కాదు, ఓటుకు డ్రగ్స్ ప్యాకెట్..!
X

చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల్లో పంచేందుకు చంద్రబాబు విశాఖకు డ్రగ్స్ తెప్పించారేమోనన్న అనుమానం తమకు ఉందన్నారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరుతున్నట్టు తెలిపారు. ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ ని కోరామన్నారు నాని. చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారన్నారు.

విశాఖలో దొరికిన డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరివో తేలకుండానే చంద్రబాబు వైసీపీపై విషం చిమ్మాడని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని నాని. సీబీఐ నోరు విప్పకముందే చంద్రబాబు బయటకొచ్చారని అన్నారు. విదేశాలనుంచి కంటైనర్లో సరకు తెప్పించిన కంపెనీ అధినేతలు.. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల చుట్టాలేనని చెప్పారు. చంద్రబాబు వదిన చుట్టాలు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారన్నారు. చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉందని గుర్తు చేశారు నాని.

నిబంధనల ఉల్లంఘన..

డ్రగ్స్ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ట్వీట్ పై కూడా తాము ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు పేర్ని నాని, అది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు నాని. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఆమె చెక్కులు పంచిపెడుతున్నారని ఆరోపించారు. చెక్కుల పంపిణీ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వివరాలు పంపిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈనాడులో వస్తున్న నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు పేర్ని నాని.

First Published:  23 March 2024 3:01 AM GMT
Next Story