Telugu Global
Andhra Pradesh

కోడికత్తి వర్సెస్ నిమ్మకాయల కత్తి

చంద్రబాబు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మేనేజ్ చేస్తున్నారని.. సీబీఐ, ఎన్ఐఏ లో కూడా.. ఆయనకు స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇంతలా మేనేజ్ చేయబడతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పేర్ని నాని.

కోడికత్తి వర్సెస్ నిమ్మకాయల కత్తి
X

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో హత్యాయత్నం జరిగితే.. దాన్ని కోడికత్తి కేసు అంటూ వెటకారం చేయడం దారుణం అని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈనాడు కూడా కోడికత్తి కేసు అంటూ రాయడం సరికాదని హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ పై నిమ్మకాయల కత్తితో దాడి జరిగితే ఆయన బొటనవేలుకి గాయమైతే.. హత్యాయత్నం అంటూ బ్యానర్ పెట్టారని, జగన్ విషయంలో అంత వివక్ష దేనికని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై దాడి చేసిన మల్లెల బాబ్జిని ఆ తర్వాత ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు. కానీ కోడికత్తి శ్రీను ఇంకా బతికే ఉన్నాడని, తాము అలాంటి దుర్మార్గులం కాదని చెప్పారు. జగన్ కి లాభం చేకూర్చేందుకే ఆ దాడి చేశానంటూ నిందితుడు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలిచ్చారని, రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిందితుడి గదిలోకి ఎలా వెళ్లి ఈ సమాచారం సేకరించారని ప్రశ్నించారు నాని.

కొన్ని పచ్చ కుక్కలు అమాయకమైన కుక్కల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. జగన్ పై దాడి జరిగిన వెంటనే అప్పటి డీజీపీ వచ్చి హత్యాయత్నం వెనుక ఎవరూ లేరని స్టేట్ మెంట్ ఇచ్చారని, ఆ తర్వాత దాడి చేసింది వైసీపీ కార్యకర్త అని తేల్చేశారని, చంద్రబాబు కూడా తామే దాడి చేయించుకున్నట్టు నిందలేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మేనేజ్ చేస్తున్నారని.. సీబీఐ, ఎన్ఐఏ లో కూడా.. ఆయనకు స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇంతలా మేనేజ్ చేయబడతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తనపై హత్యాయత్నం జరిగితే, దాని వెనక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం జగన్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు నాని. విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ వేసే హక్కు జగన్ కి లేదా అన్నారు. అలిపిరి ఘటన కూడా డ్రామానా చంద్రబాబూ అని ప్రశ్నించారు నాని. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు వైఎస్‌ఆర్‌ ఖండించారని గుర్తు చేశారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌ పోర్టు లోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై విచారణ జరగాలని జగన్ అప్పట్లో పిటిషన్ వేశారని, ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా? అని అడిగారు.

First Published:  15 April 2023 1:41 PM GMT
Next Story