Telugu Global
Andhra Pradesh

జనాలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయా?

స్కామ్‌లో చంద్రబాబుతో పాటు తన పాత్ర లేకపోతే పార్టీని, కుటుంబాన్ని వదిలేసి లోకేష్ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

జనాలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయా?
X

గడచిన పది రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే మకాం వేయటం పార్టీ నేతలతో పాటు జనాల‌కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో తండ్రి చంద్రబాబును అరెస్టు చేసినట్లే తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతోనే లోకేష్ ఏపీని వదిలేసి ఢిల్లీలోనే ఉంటున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడు, అనేక స్కామ్‌లో కీలక నిందితుడు అయిన కిలారు రాజేష్ అమెరికా పారిపోయాడనే ప్రచారం లోకేష్‌కు మరింత డ్యామేజీగా మారింది.

లేని స్కామ్ ఉన్నట్లుగా చూపించి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న వాదన నిలబడలేదు. స్కామ్‌ నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు, లోకేష్, తమ్ముళ్ళు, ఎల్లో మీడియా అంతా కలిసి సానుభూతి డ్రామాలు ఆడుతున్నట్లు జనాల్లో చర్చలు మొదలయ్యాయి. స్కామ్‌లో చంద్రబాబుతో పాటు తన పాత్ర లేకపోతే పార్టీని, కుటుంబాన్ని వదిలేసి లోకేష్ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు జ‌రుపుతున్న‌ట్లు ఎల్లోమీడియా కవరింగ్ ఇస్తోంది. సిద్దార్థ లూథ్రా, హరీష్ సాల్వే, అగర్వాల్ లాంటి పెద్దపెద్ద లాయర్లంతా చంద్రబాబుతోనే టచ్‌లో ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీలో ఇంకెవరితో మాట్లాడుతారు.

లోకేష్ తీరుతో నేతలు, క్యాడర్ కూడా స్కామ్ జరగలేదని బలంగా జనాలకు చెప్పలేకపోతున్నారు. పార్టీలో జరుగుతున్న చర్చ ఏమిటంటే ఆఫ్ట్రాల్ రూ. 371 కోట్ల స్కామ్‌లో చంద్రబాబు ఎలా ఇరుక్కున్నాడన్న విషయంపైనే అందరు ఆశ్చర్యపోతున్నారు. కోర్టుల్లో విచారణ తీరును జనాలందరూ గమనిస్తున్న కారణంగా స్కామ్‌లో చంద్రబాబుతో పాటు చినబాబు కూడా ఇరుక్కున్నాడనే సిగ్నల్స్ వెళిపోతున్నాయి. ఇందులో నుంచి చినబాబు బయటపడే అవకాశంలేదని, ఏదో రోజు అరెస్టు తప్పదని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

అందుకనే పార్టీలో కొత్తగా ఏర్పాటైన పొలిటికల్ యాక్షన్ కమిటీని లీడ్ చేయాల్సిన లోకేష్ పేరు జాబితాలో చివరకు 14వ పేరుగా మిగిలిపోయింది. స్కామ్ జరగలేదని, చంద్రబాబును ప్రభుత్వం ఇరికించిందని జనాలు ఎవరు అనుకోవటంలేదు. అందుకనే టీడీపీ ఎన్నిసార్లు పిలుపిచ్చినా, ఎల్లోమీడియా ఎంతగా రెచ్చగొడుతున్నా జనాలు చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపైకి రావటంలేదు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్లో ఎక్కువభాగం సొంత సామాజికవర్గం లేదా టీడీపీ మద్దతుదారులదే అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఏదేమైనా చినబాబు వెళ్ళి ఢిల్లీలో కూర్చోవటంతో నేతలు, జనాలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతున్నాయన్నది మాత్రం వాస్తవం.


First Published:  26 Sep 2023 6:01 AM GMT
Next Story