Telugu Global
Andhra Pradesh

పెన్షన్ల పంపిణీ.. ఆ పాపం టీడీపీదే

సజావుగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకొన్నది కూటమి నేతలే. ఇప్పుడు ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నదీ వారే. ఇక్కడే వారి డబుల్ గేమ్ అర్థం చేసుకోవచ్చు.

పెన్షన్ల పంపిణీ.. ఆ పాపం టీడీపీదే
X

వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీని అడ్డుకొన్నది, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టింది టీడీపీయే. ఆ పాపం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. గత నెల వృద్ధులు, వికలాంగులు ఎండల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు, తమని కష్టాలపాలు చేసిన టీడీపీ నేతల్ని చెడామడా తిట్టుకున్నారు. దీంతో ఆ పార్టీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీని ఉన్నతాధికారులు కావాలనే ఆపేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా పెన్షన్ పంపిణీకి టైమ్ దగ్గరపడటంతో మరోసారి టీడీపీ డ్రామా మొదలు పెట్టింది.

పెన్షన్ల పంపిణీపై ఇప్పటికే ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉంటే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలన్నది, లేకపోతే సచివాలయాల వద్ద పంపిణీ జరగాలని చెప్పింది. అయితే లబ్ధిదారులెవరూ ఇబ్బందులకు గురికాకూడదని మాత్రం స్పష్టం చేసింది. ఈసారి కూడా అవే ఆదేశాలు పాటించాలని చెప్పింది. ఈసారి కూడా గతంలోలాగే సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ జరుగుతుందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి నేతలు తెరపైకి వచ్చారు. పెన్షన్ల పంపిణీ ఇంటివద్దే జరగాలని వారు సీఎస్ కి వినతిపత్రం అందించారు.

సజావుగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకొన్నది కూటమి నేతలే. ఇప్పుడు ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నదీ వారే. అంటే ఇక్కడే వారి డబుల్ గేమ్ అర్థం చేసుకోవచ్చు. వాలంటీర్లు అవసరం లేకండా ఇంటింటి పెన్షన్ పంపిణీ అసాధ్యం. కానీ సచివాలయాల ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి, ఇతర ఉద్యోగుల్ని కూడా వినియోగించుకుని ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు కూటమి నేతలు. పరోక్షంగా సీఎస్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారులంతా కూటమి నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ తిట్లను తప్పించుకోడానికి ఇలా కొత్త ఎత్తువేశారు వారంతా. పెన్షన్ పంపిణీని అడ్డుకున్నది తాము కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనానికి మాత్రం ఆవిషయంలో క్లారిటీ ఉంది. పెన్షన్ పాపం ఆల్రడీ కూటమి ఖాతాలోనే పడింది. ఆ ప్రభావం ఎన్నికల్లో కూడా కనపడుతుంది.

First Published:  27 April 2024 12:38 PM GMT
Next Story