Telugu Global
Andhra Pradesh

పెడనలో రాజుకున్న చిచ్చు.. ఇండిపెండెంట్‌గా బూరగడ్డ..?

తాజాగా పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌కు నిరాశే ఎదురైంది. పెడన టికెట్‌ను కాగిత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు మాట తప్పారంటూ మండిపడ్డారు బూరగడ్డ.

పెడనలో రాజుకున్న చిచ్చు.. ఇండిపెండెంట్‌గా బూరగడ్డ..?
X

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో పలు నియోజకవర్గాల్లో విబేధాలు భగ్గుమన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు చంద్రబాబు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే రాయచోటి, ఆలూరు నియోజకవర్గాల్లో శ్రేణులు నిరసనలకు దిగాయి.

తాజాగా పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌కు నిరాశే ఎదురైంది. పెడన టికెట్‌ను కాగిత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు మాట తప్పారంటూ మండిపడ్డారు బూరగడ్డ. 2024లో సీటు కేటాయిస్తానని చెప్పి 2019లో పోటీ నుంచి తప్పించారని.. కానీ ఇప్పుడు ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెడన నియోజకవర్గంతో తన కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు, తన తండ్రికి ఏనాడూ 40 వేలకు ఓట్లు తగ్గలేదన్నారు. పరోక్షంగా ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

2014లో పెడన నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వేదవ్యాస్. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2019లో బూరగడ్డను కాదని కాగిత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు బాబు. అయితే ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన జోగి రమేష్‌.. దాదాపు 7 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

First Published:  24 Feb 2024 12:09 PM GMT
Next Story