టీడీపీ సోషల్ మీడియా సలహాదారులుగా పయ్యావుల, జీవీ రెడ్డి
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సోషల్ మీడియా సలహాదారుగా నియమించడంపై పార్టీలో విస్మయం వ్యక్తం అవుతుంది. కేశవ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ఈ బాధ్యతలు అప్పగించారనే విమర్శలున్నాయి.
BY Telugu Global10 Jan 2023 3:00 PM GMT

X
Telugu Global10 Jan 2023 3:00 PM GMT
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసే బాధ్యతను పయ్యావుల కేశవ్, జీవీరెడ్డి, చింతకాయల విజయ్ లకు పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సోషల్ మీడియా సలహాదారుగా నియమించడంపై పార్టీలో విస్మయం వ్యక్తం అవుతుంది. కేశవ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ఈ బాధ్యతలు అప్పగించారనే విమర్శలున్నాయి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా మీడియాలో తెలుగుదేశం పార్టీ వాణిని వినిపిస్తున్న జీవి రెడ్డిని సోషల్ మీడియా సలహాదారుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
Next Story