Telugu Global
Andhra Pradesh

రుషికొండకు 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా..?

ఇటీవల రుషికొండపై గ్రీన్ మ్యాట్ పరిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి 151 అడుగుల స్టిక్కర్ వేస్తారేమో అంటూ చమత్కరించారు.

రుషికొండకు 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా..?
X

రుషికొండపై జరుగుతున్న తవ్వకాలపై పవన్ కల్యాణ్‌ సెటైర్లు వేశారు. నిబంధనలు ఉల్లంఘించారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సమాధానం చెబుతుందా, లేక రుషికొండపై గ్రీన్ మ్యాట్ వేసినట్టు 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని కౌంటర్ ఇచ్చారు.

చెట్లు నరికేయడం, కొండలను ఆక్రమించడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు పవన్. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని, ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదని, ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిన విషయం అన్నారు. ఇటీవల రుషికొండపై గ్రీన్ మ్యాట్ పరిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి 151 అడుగుల స్టిక్కర్ వేస్తారేమో అంటూ చమత్కరించారు.


రుషికొండను తొలిచి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడాన్ని మొదటి నుంచీ పర్యావరణ వేత్తలు ఆక్షేపిస్తున్నారు. అయితే విశాఖను పాలనా రాజధాని చేయాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం భవనాల కోసం రుషికొండను రెడీ చేస్తోంది. అన్ని అనుమతులు తీసుకుని పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, పర్యావరణ చట్టాలు ఉల్లంఘించారని పదే పదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నిపుణుల కమిటీ కూడా ఇదే తేల్చినట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్, వైసీపీ 151 సీట్లపై సెటైర్లు వేశారు. 151 అడుగుల స్టిక్కర్లు వేస్తారమో అని ట్వీట్ వేశారు.

First Published:  14 April 2023 7:44 AM GMT
Next Story