Telugu Global
Andhra Pradesh

మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయినట్లేనా?

మోడీతో భేటీ తర్వాత పవన్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే తాజాగా మోడీని ఉద్దేశించి ఆకాశానికి ఎత్తేస్తు పవన్ చేసిన ట్వీట్ చూసినవాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయినట్లేనా?
X

ఒక్క భేటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో ఎంతటి మార్పు తెచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. నరేంద్ర మోడీ మొన్న విశాఖపట్నంలో పర్యటించిన విషయం తిలిసిందే. ఈ సందర్భంగా 11వ తేదీ రాత్రి మోడీతో పవన్ అర్ధగంట భేటీ అయ్యారు. లోపల ఏమి జరిగిందో డైలాగ్ బై డైలాగ్ ఎవరికీ తెలీదు. కానీ ఆ తర్వాత పవన్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే తాజాగా మోడీని ఉద్దేశించి ఆకాశానికి ఎత్తేస్తు పవన్ చేసిన ట్వీట్ చూసినవాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ట్వీట్‌లో ఏముందంటే 'క్లిష్ట సమయంలో పాలనా పగ్గాలు చేపట్టి ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలను అర్ధం చేసుకుని అందరిలో భారతీయులమనే భావనను నింపారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశభద్రతకు పొంచి ఉన్న ముప్పు నుండి రక్షించేందుకు అహరహం తపించారు. ప్రతికఠిన పరిస్ధితిని ఉక్కుసంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి మోడీ' అనుంది. నిజంగా పవన్ చెప్పినంత సీన్ లేదు మోడీకి. క్లిష్ట సమయంలో పాలనా పగ్గాలు చేపట్టారని పవన్ అన్నారు.

మోడీ ప్రధాని అయ్యేనాటికే భారత్ చాలా రంగాల్లో పటిష్టంగా ఉంది. అంతేకానీ క్లిష్ట పరిస్ధితుల్లో ఏమీలేదు. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ప్రాంతీయవాదనలు బాగా ఎక్కవైపోయాయి. ప్రజారోగ్యాన్ని, దేశభద్రతను మోడీ రక్షించేందేమీలేదు. ఉగ్రవాద, తీవ్రవాద సమస్య బాగా పెరిగిపోయింది. ప్రతి కఠిన పరిస్ధితిని ఉక్కు సంకల్పంతో మోడీ ఎదుర్కొన్నట్లు పవన్ చెప్పారు. ఉక్కు సంక్పలంతో ఎదుర్కోవాల్సినంత కఠినమైన పరిస్ధితులేమీ మోడీకి ఎదురుకాలేదు. ఇంకా మోడీ దెబ్బకు ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో అందరూ చూస్తున్నదే.

నోట్ల రద్దు, కరోనా సమయంలో తీసుకున్న లాక్ డౌన్ లాంటి సడెన్ నిర్ణయాల వల్ల యావత్ దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. నిజంగా చెప్పాలంటే అదృష్టం వల్ల మోడీ ప్రధాన మంత్రిగా కంటిన్యూ అవుతున్నారే కానీ సామర్ద్యం ఉండికాదని అందరికీ తెలుసు. మొత్తానికి మోడీకి లేని గుణాలను ఆపాదించేంతగా పవన్ సరెండర్ అయిపోయిన విషయమే చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

First Published:  15 Nov 2022 4:32 AM GMT
Next Story