Telugu Global
Andhra Pradesh

24 సీట్లలో 5 స్థానాలకే అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌.!

ప‌వ‌న్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోలేదు. భీమవరంలో మాత్రం రెండు, మూడు సార్లు చుట్టపుచూపులా పర్యటించి వెళ్లారు.

24 సీట్లలో 5 స్థానాలకే అభ్యర్థుల ప్ర‌క‌ట‌న‌.!
X

పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ టికెట్లు కేటాయించార‌ని ప‌వ‌న్ చెప్పుకున్నారు. చంద్రబాబు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. జనసేనాని మాత్రం కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఆ ఐదు స్థానాల్లో పవన్‌కల్యాణ్‌ పేరే లేదు. ఈ పరిస్థితి చూస్తే అసలు జాబితా ప్రకటించేంత వరకు జనసేనకు కేటాయించబోతున్న సీట్లపై అయిన పవన్‌కల్యాణ్‌కు అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతోంది.

జనసేనాని కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..?

ప‌వ‌న్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోలేదు. భీమవరంలో మాత్రం రెండు, మూడు సార్లు చుట్టపుచూపులా పర్యటించి వెళ్లారు. స్థానికంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలను కలిశారు. దీంతో ఆయన ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఫస్ట్‌ లిస్ట్‌లో మాత్రం భీమవరం అభ్యర్థిని ప్రకటించని పరిస్థితి. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పవన్‌ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఇదంతా చూస్తే పవన్‌ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది.

First Published:  24 Feb 2024 9:23 AM GMT
Next Story