Telugu Global
Andhra Pradesh

బోట్ల ద‌గ్ధం.. పవన్ అభిమాని పనేనా?

తన బోటుకు నాని నిప్పంటించిన కారణంగానే మరికొన్ని బోట్లు కూడా తగలబడి ఉంటాయ‌ని పోలీసులు నిర్ధారణకొచ్చారు. యూట్యూబర్ నాని జనసేనలో యాక్టివ్‌గా పనిచేస్తాడట. పవన్‌కు వీరాభిమాని అయిన నాని తన హీరో పాటలనే యూట్యూబ్‌లో ఎక్కువగా ప్రమోట్ చేస్తాడని పోలీసులు గుర్తించారు.

బోట్ల ద‌గ్ధం.. పవన్ అభిమాని పనేనా?
X

విశాఖ షప్పింగ్ హార్బర్‌లో బోట్లు తగలబడటం సంచలనంగా మారింది. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి జరిగిన ఘటనలో 40 బోట్లు పూర్తిగా కాలిపోవ‌డంతో పాటు మరో 40 బోట్లు పాక్షింగా ద‌గ్ధ‌మ‌య్యాయి. మొత్తంమీద ఒకేసారి అన్ని బోట్లు తగలబడటంతో కలకలం రేగింది. ఘటనపై ప్రభుత్వం వెంటనే సీరియస్‌గా స్పందించింది. ఘటన దర్యాప్తుపై వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మీడియా, సోషల్ మీడియా సమాచారం ప్రకారం నాని బోట్లు తగలబడిన ప్రాంతంలో ఫ్రెండ్స్ కు పెద్ద పార్టీ ఇచ్చాడట. నానికి కూడా సొంతానికి ఒక బోటుంది. ఆ బోటు కూడా మిగిలిన బోట్లతోనే కలిపి ఉంది. డబ్బులు అవసరమై తన బోటును బాలాజి అనే వ్యక్తికి నాని అమ్మేశాడట. బోటు అమ్మకంలో బాలాజి నుండి నాని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఎందుకనో బాలాజీ బోటును కొనుక్కోవటంలో వెనక్కు తగ్గాడు.. ఇచ్చిన‌ అడ్వాన్స్ ను వెనక్కు తీసుకోవాలని అనుకున్నాడు.

అందుకనే అడ్వాన్స్ వెనక్కు తీసుకునేందుకు నానిని వెతుక్కుంటు పార్టీ జరిగిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ డబ్బులు వెనక్కిచ్చే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై పెద్ద గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో బాలాజీ వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో బోట్లు తగలబడ్డాయి. పోలీసుల సమాచారం ఏమిటంటే బాలాజీ మీద కోపంతో నాని తన బోటుకు తానే నిప్పంటించాడట. బోటులోని డీజల్‌ను బయటకు తీసి బోటుపై చల్లి నిప్పుపెట్టినట్లు అంగీకరించాడట. తర్వాత కాలిపోతున్న బోట్లను వీడియో తీసి యూట్యూబ్ ఛానల్‌లో నాని అప్ లోడు కూడా చేశాడు. అంటే తాగిన మైకంలో ఏమిచేస్తున్నాడో కూడా నానీకి అర్థ‌మైనట్లు లేదు.

తన బోటుకు నాని నిప్పంటించిన కారణంగానే మరికొన్ని బోట్లు కూడా తగలబడి ఉంటాయ‌ని పోలీసులు నిర్ధారణకొచ్చారు. యూట్యూబర్ నాని జనసేనలో యాక్టివ్‌గా పనిచేస్తాడట. పవన్‌కు వీరాభిమాని అయిన నాని తన హీరో పాటలనే యూట్యూబ్‌లో ఎక్కువగా ప్రమోట్ చేస్తాడని పోలీసులు గుర్తించారు. హార్బర్ ఘ‌ట‌న‌ తన అభిమాని పనే అన్న విషయం తెలుసు కాబట్టే ప్రభుత్వంపై పవన్ ఒక్క ఆరోపణ కూడా చేయలేదనే వాదన పెరిగిపోతోంది. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

First Published:  22 Nov 2023 4:18 AM GMT
Next Story