Telugu Global
Andhra Pradesh

ఏపీలో దసరా సెలవులపై ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాసంఘాలు, టీచర్ల అభ్యర్థనల మేరకు మొదట ప్రకటించిన తేదీల్లో మార్పు

ఏపీలో దసరా సెలవులపై ఉత్తర్వులు జారీ
X

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని దసరా సెలవుల తేదీలను ఒకరోజుకు ముందుకు మార్చారు. మొదట అక్టోబర్‌ 4 నుంచి 13 వరకు సెలవులను ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలను రాగా.. ఈ సెలవులను అక్టోబర్‌ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న స్కూల్స్‌ ప్రారంభమౌతాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

First Published:  1 Oct 2024 7:32 AM GMT
Next Story