Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి హాలీవుడ్ అసోసియేషన్ వివరణ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేరుగా HCAని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేశారు, సోషల్ మీడియాలో HCA పేరుతో విపరీతంగా ఈ ప్రశ్నలు వైరల్ అయ్యాయి. దీంతో నేరుగా HCA స్పందించింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి హాలీవుడ్ అసోసియేషన్ వివరణ..
X

‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డుల కార్యక్రమం ఇటీవల లాస్ ఏంజిలస్ లో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీం సభ్యులు హాజరయ్యారు. రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి సహా ఇతర టీమ్ కూడా అవార్డు ఫంక్షన్లో సందడి చేసింది. కానీ ఎన్టీఆర్ మిస్ అయ్యారు. ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లలేదు? ఎన్టీఆర్ ని ఆహ్వానించలేదా..? అందరూ ఉంటే ఎన్టీఆర్ మాత్రమే ఎందుకు ఆ కార్యక్రమంలో కనపడలేదు..? ఇలాంటి ప్రశ్నలు తారక్ ఫ్యాన్స్ నుంచి మొదలయ్యాయి. దీంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్(HCA) వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేరుగా HCAని టార్గెట్ చేస్తూ ట్వీట్లు వేశారు, సోషల్ మీడియాలో HCA పేరుతో విపరీతంగా ఈ ప్రశ్నలు వైరల్ అయ్యాయి. దీంతో నేరుగా HCA స్పందించింది. తారక్‌ ఎందుకు రాలేకపోయాడో ట్వీట్‌ చేసింది. తారక్ ని అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించామని, కానీ ఆయన రాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారని, త్వరలోనే తాము ఆ అవార్డుని ఎన్టీఆర్ కి అప్పగిస్తామని ట్వీట్ ద్వారా తెలిపారు.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాను అభిమానించే వాళ్లకి, సపోర్ట్‌ చేసేవాళ్లకి నమస్కారం. మేం ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ ను కూడా ఆహ్వానించాం. భారత్‌ లో కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా ఆయన రాలేకపోయారు. మేం త్వరలోనే అవార్డును ఆయనకు అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని HCA ట్వీట్‌ చేసింది. అయితే ఆయన సోదరుడు చనిపోయాడు కాబట్టి సినిమా షూటింగ్ ఆగిపోయింది కదా అని మరో అభిమాని ప్రశ్నించాడు. దీనికి కూడా HCAనుంచి రిప్లై వచ్చింది. ఆ విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని. ఆయన సోదరుడు చనిపోవడం వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయిందని, అయినా ఆయన అవార్డు ఫంక్షన్ కి రాలేకపోయారని పేర్కొంది. ఈ వివరణతో ఫ్యాన్స్ సంతృప్తి చెందినా, అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకునేందుకు అభిమాన హీరో వెళ్లలేకపోవడం వల్ల వారంతా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు.

First Published:  28 Feb 2023 7:34 AM GMT
Next Story