Telugu Global
Andhra Pradesh

బ్లాక్ మార్కెట్ లో ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతంటే..?

సోషల్ మీడియా కాలంలో ఇప్పుడన్నీ కమర్షియల్ గా మారిపోయాయి. ఎన్టీఆర్ నాణెం తో సెల్ఫీ దిగడం, అది తమ దగ్గర ఉందని చెప్పుకోవడం పెద్ద క్రేజ్ గా మారింది. దీంతో చాలామంది ఆ నాణెం కోసం ఎగబడుతున్నారు. స్టాక్ లేదని తెలిసి ఉసూరుమంటున్నారు.

బ్లాక్ మార్కెట్ లో ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతంటే..?
X

ఇటీవల రాష్ట్రపతి విడుదల చేసిన ఎన్టీఆర్ నాణెం ముఖ విలువ రూ.100

అధికారికంగా దాన్ని కొనుగోలు చేయాలంటే రూ.4850 నుంచి ధర మొదలవుతుంది.

కానీ బ్లాక్ మార్కెట్ లో ఎన్టీఆర్ నాణెం ధర రూ.10,000 వరకు చేరిందని సమాచారం.

ఎన్టీఆర్ నాణెంను ఆన్ లైన్ లో విడుదల చేయగానే వెబ్ సైట్ లో నో స్టాక్ అనే మెసేజ్ కనపడుతోంది. అటు మింట్ కాంపౌండ్ లో కూడా పరిమిత సంఖ్యలోనే నాణేలు అందుబాటులో ఉన్నాయి. అది కూడా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. దీంతో 5వేల రూపాయలు ఖర్చు చేసయినా ఎన్టీఆర్ నాణెం సొంతం చేసుకోవాలనుకునే అభిమానులకు నిరాశ తప్పలేదు.

సోషల్ మీడియా కాలంలో ఇప్పుడన్నీ కమర్షియల్ గా మారిపోయాయి. ఎన్టీఆర్ నాణెం తో సెల్ఫీ దిగడం, అది తమ దగ్గర ఉందని చెప్పుకోవడం పెద్ద క్రేజ్ గా మారింది. దీంతో చాలామంది ఆ నాణెం కోసం ఎగబడుతున్నారు. స్టాక్ లేదని తెలిసి ఉసూరుమంటున్నారు. అలాంటి వారిని కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్ లో నాణేలు ఉన్నాయంటూ ఊరిస్తున్నారు. రూ.10వేల వరకు బేరం పెడుతున్నారు.

నిజమెంత..?

ఎన్టీఆర్ నాణెం 4850 రూపాయలకు కొనుగోలు చేసినవారు దాన్ని మరింత ఎక్కువరేటుకి అమ్ముకుంటున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. అయితే రేటు మరీ 10వేల రూపాయలంటేనే ఆశ్చర్యంగా ఉంది. డిమాండ్ ఎక్కువ కావడంతో అంత మొత్తం ఖర్చు చేసేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ బ్లాక్ మార్కెట్ చర్చ విపరీతంగా జరుగుతోంది. బ్లాక్ లో నాణెం అమ్మినవారు సైలెంట్ గా ఉంటారు, కొనుక్కున్నవారు కూడా ఫలానా వారి దగ్గర తీసుకున్నాం అని చెప్పలేరు. అందుకే ఇప్పుడది సంచలన వార్తగా మారింది. మొత్తానికి రాష్ట్రపతి భవన్ ని రాజకీయాలకు వాడుకున్నారంటూ జరిగిన చర్చ నిజంగానే రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు అభిమానులు ఎన్టీఆర్ కాయిన్ ని బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తోంది.

First Published:  1 Sep 2023 4:27 AM GMT
Next Story