లోకేష్‌తో యశ్ భేటీ ఎందుకు జరిగింది?
యశ్ స్నేహితుడు ఒకరు నారా లోకేష్‌కు సన్నిహితుడు. అతడు లోకేష్ వద్దకు వెళ్తూ యశ్‌ను కూడా తీసుకెళ్లాడు. ఆ నేపథ్యంలోనే నారా లోకేష్, యశ్ కాసేపు మాట్లాడుకున్నారు.
BY Telugu Global16 Dec 2022 2:30 AM GMT

X
Telugu Global16 Dec 2022 2:30 AM GMT
టీడీపీ నేత నారా లోకేష్‌లో కేజీఎఫ్ హీరో యశ్ భేటీ జరిగింది. ఈ సమావేశాన్ని టీడీపీ నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ భేటీ నారా లోకేష్ నివాసంలోనే జరిగింది. ఈ భేటీ ప్రత్యేక కారణాలతో ఏమీ జరగలేదు.
యశ్ స్నేహితుడు ఒకరు నారా లోకేష్‌కు సన్నిహితుడు. అతడు లోకేష్ వద్దకు వెళ్తూ యశ్‌ను కూడా తీసుకెళ్లాడు. ఆ నేపథ్యంలోనే నారా లోకేష్, యశ్ కాసేపు మాట్లాడుకున్నారు. అంతకు మించి ఏమీ జరగలేదు. కేజీఎఫ్ సినిమా అనుభవాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు.
యశ్‌గా పిలిచే నవీన్ కుమార్ గౌడది కర్నాటకలోని హసన్ స్వస్థలం. కేజీఎఫ్ సినిమాతో ఆయన స్టార్ అయ్యారు. వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వచ్చిన ఆయన స్నేహితుడితో పాటు లోకేష్ ఇంటికి వెళ్లారు.
Next Story