Telugu Global
Andhra Pradesh

అఖిలకు నో ఎంట్రీయా..?

ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు, జరిగిన తర్వాత కూడా బనగానపల్లిలో అఖిల ఎక్కడా కనబడలేదు. గురువారం రాత్రి చంద్రబాబు నంద్యాల జిల్లాలోకి ఎంటరైనప్పుడు కూడా రిసీవ్ చేసుకున్న వాళ్ళల్లో అఖిల కనబడలేదు.

అఖిలకు నో ఎంట్రీయా..?
X

చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పర్యటనలో మాజీమంత్రి భూమా అఖిలప్రియకు ఎంట్రీ దొరకలేదా..? గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నంద్యాల జిల్లాలోని బనగానపల్లిలో చంద్రబాబు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మహిళలతో ప్రజావేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికమీద చంద్రబాబు, కోట్ల సుజాతమ్మతో కలిపి ఏడుగురు మహిళలు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా కేవలం మహిళలే.

ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు, జరిగిన తర్వాత కూడా బనగానపల్లిలో అఖిల ఎక్కడా కనబడలేదు. గురువారం రాత్రి చంద్రబాబు నంద్యాల జిల్లాలోకి ఎంటరైనప్పుడు కూడా రిసీవ్ చేసుకున్న వాళ్ళల్లో అఖిల కనబడలేదు. సీనియర్ నేతలు చాలామంది కనిపించినా మాజీమంత్రి అడ్రస్ లేరు. సో.. జరిగింది చూస్తుంటే చంద్రబాబు కార్యక్రమంలో అఖిలకు ఎంట్రీ దొరకలేదని అర్థ‌మవుతోంది. చాలాకాలంగా నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో పార్టీని మాజీమంత్రి కంపుచేస్తున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు ఆదేశాలకు వ్యతిరేకంగా అఖిల రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాలకు ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు నియమించినా అఖిల ప్రియ‌ పట్టించుకోలేదు. ఆళ్ళగడ్డలో తాను నంద్యాలలో తన తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించేశారు. పార్టీలోని సీనియర్లు ఎవరితో కూడా అఖిల ప్రియ‌కు పడటంలేదు. పైగా హత్యాయత్నం, కిడ్నాపులు, దౌర్జన్యాలు, ఫోర్జరీ, బెదిరింపులు, బ్యాంకు అప్పులు ఎగ్గొట్టడం లాంటి అనేక కేసులు అఖిల‌ప్రియ మీదున్నాయి. హైదరాబాద్ లో కిడ్నాప్ కేసులో దొరికిపోయి అరెస్టయి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు.

ఇంత వివాదాస్పదమైంది కాబట్టే అఖిలను చంద్రబాబు దూరం పెట్టేశారు. దాంతో రాబోయే ఎన్నికల్లో అఖిల ఏమిచేస్తారో సస్పెన్సుగా మారింది. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ తో అఖిల భేటీ అయ్యారట. జిల్లా మొత్తం తాను చెప్పిన వాళ్ళకి టికెట్లిస్తే కనీసం నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. బహుశా అక్కా, తమ్ముళ్ళు ఆ పార్టీ తరఫున పోటీచేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఆమె ఏమిచేస్తారో చూడాల్సిందే.

*

First Published:  9 Sep 2023 5:07 AM GMT
Next Story