Telugu Global
Andhra Pradesh

'వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్'..? ఏపీలో కొత్త చర్చకు శ్రీకారం

పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల.. ఓటర్ల జాబితా సవరణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు వచ్చేలా కృషి చేయాలన్నారు.

వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్..? ఏపీలో కొత్త చర్చకు శ్రీకారం
X

మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. జగనన్న సురక్ష కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో కొత్తగా చర్చా కార్యక్రమాలకు వైసీపీ శ్రీకారం చుడుతోంది. ఆ చర్చా కార్యక్రమాల పేరు 'వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్'..?

నియోజకవర్గాల్లో సమావేశం..

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసన సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ చార్జ్ లు ‘వై ఏపీ నీడ్స్‌ వైఎస్‌ జగన్‌’ అనే అంశంపై సమావేశాలు నిర్వహించాలని చెప్పారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సమావేశాలలో మండల, పట్టణ స్థాయి నేతలు, సచివాలయ, మండల కన్వీనర్లు, గృహ సారథులు, పరిశీలకులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా గల నాయకుడు జగన్‌ మాత్రమే అనేవిషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులను మోటివేట్‌ చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ మెజారిటీ పెంచేలా, ప్రతి ఓటర్‌ తో ఓటు వేయించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల.. ఓటర్ల జాబితా సవరణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు వచ్చేలా కృషి చేయాలన్నారు.

దొంగఓట్లు వారివే..

ఏపీలో దొంగఓట్లు మీవంటే మీవంటూ టీడీపీ, వైసీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ దొంగఓట్లను చేర్చిందని టీడీపీ నేతలంటున్నారు. కాదు కాదు చంద్రబాబు హయాంలో 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ దొంగఓట్ల వివరాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లి, జాబితా నుంచి తొలగించేలా చూడాలని చెప్పారు సజ్జల.

గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లకు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు సజ్జల. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకుంటున్నామని తెలిపారు. అంకిత భావంతో, కష్ట పడి పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని, పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు సజ్జల.

First Published:  13 Aug 2023 4:05 AM GMT
Next Story