Telugu Global
Andhra Pradesh

చిట్ డబ్బులు ఎగ్గొట్టారు.. మార్గదర్శిపై మరో కేసు

చిట్ గ్రూప్ లో సభ్యులు పూర్తిగా లేకపోయినా వాటిని నిర్వహిస్తున్నారంటూ గతంలోనే మార్గదర్శిపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ కేసులో కూడా ఆ విషయం బయటపడింది. 50మంది ఉండాల్సిన చిట్ గ్రూప్ లో 30మందే ఉన్నారు.

చిట్ డబ్బులు ఎగ్గొట్టారు.. మార్గదర్శిపై మరో కేసు
X

చిట్ డబ్బులు ఎగ్గొట్టారని మీకెవరైనా ఫిర్యాదు చేశారా..? రాజకీయ కారణాలతో వేధిస్తారా..? అంటూ మార్గదర్శి ఇన్నాళ్లూ ప్రశ్నిస్తూ వచ్చింది. అవకతవకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు ముష్టి శ్రీనివాస్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్ పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్ పాడుకున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని, కనీసం తాను జమ చేసి మొత్తం కూడా తిరిగి ఇవ్వనంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్.

కేసేంటంటే..?

విజయవాడకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ శ్రీనివాస్.. లబ్బీపేటలోని మార్గదర్శి సంస్థలో 50లక్షల చిట్ గ్రూప్ లో 2021 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాడు. చిట్ పాడుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాలంటే షూరిటీ చూపించాలన్నారు సిబ్బంది. చిట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటిని ష్యూరిటీగా చూపించాడు. చిట్ లో చేరేటప్పుడు ఆ షూరిటీకి ఓకే చెప్పిన సిబ్బంది తీరా 2023 ఫిబ్రవరిలో చిట్ పాడుకున్న తర్వాత మాత్రం అది సరిపోదని అడ్డం తిరిగారు. చిట్ డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు శ్రీనివాస్.

50మంది ఉండాల్సిన గ్రూప్ లో 30మంది..

చిట్ గ్రూప్ లో సభ్యులు పూర్తిగా లేకపోయినా వాటిని నిర్వహిస్తున్నారంటూ గతంలోనే మార్గదర్శిపై ఫిర్యాదు ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ కేసులో కూడా ఆ విషయం బయటపడింది. 50మంది ఉండాల్సిన చిట్ గ్రూప్ లో 30మందే ఉన్నారు. ఈ చిట్ కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సిన బ్యాంకు ఖాతా లేదు. ఉమ్మడి ఖాతాతో లావాదేవీలు జరుగుతున్నాయి. మీడియా సమావేశంలో కేసు వివరాలు, ఆ చిట్ గ్రూప్ లో నిబంధనల ఉల్లంఘన గురించి చెప్పారు కమిషనర్ కాంతిరాణా టాటా. లబ్బీపేట బ్రాంచి మార్గదర్శి మేనేజర్‌ బి.శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామమని తెలిపారు. ఆ బ్రాంచిలో పనిచేసే సిబ్బంది, మార్గదర్శి చిట్‌ ఫండ్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది.

First Published:  21 July 2023 1:19 AM GMT
Next Story