Telugu Global
Andhra Pradesh

ఏపీలో కొత్తగా కుయ్ కుయ్ కుయ్

గత టీడీపీ ప్రభుత్వంలో 108 వ్యవస్థను నిర్వీర్యం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్‌ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ఏపీలో కొత్తగా కుయ్ కుయ్ కుయ్
X

కుయ్ కుయ్ కుయ్ అనే మాట వినగానే.. 108 అంబులెన్స్ లు, వైఎస్ఆర్ మాటలు గుర్తురాక మానవు. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త 108లను రోడ్లపైకి తెస్తోంది. పాతవి, రిపేర్ కి వచ్చినవాటి స్థానంలో కొత్తవి ప్రవేశ పెడుతున్నట్టు తెలిపింది ప్రభుత్వం. ఏపీలో 108 సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు.

146 కొత్త అంబులెన్స్ లు..

ప్రస్తుతం ఏపీలో 768 ప్రభుత్వ అంబులెన్స్ లు ఉన్నాయి. వీటిలో కొన్ని రిపేర్ కి వచ్చాయి. వాటి స్థానంలో ఈరోజు 146 అంబులెన్స్ లను ప్రవేశపెడుతున్నారు. రూ.34.79 కోట్లతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ఈ అంబులెన్స్ లను ప్రారంభిస్తారు.

గతంలో అలా.. ఇప్పుడిలా..

గత టీడీపీ ప్రభుత్వంలో 108 వ్యవస్థను నిర్వీర్యం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అప్పట్లో 1.19 లక్షల మందికి ఒక అంబులెన్స్‌ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2020 నాటికి మండలానికి ఒక 108 అంబులెన్స్‌ ను సమకూర్చింది ప్రభుత్వం. 2022 అక్టోబర్‌ లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్స్ లు కొనుగోలు చేశారు.

108 సేవలు ఇలా..

ప్రస్తుతం ఏపీలోని 108 అంబులెన్స్‌ లు రోజుకు 3,089 కేసులకు అటెండ్‌ అవుతున్నాయి. 2020 జులై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌ లు సేవలందించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సేవలు వినియోగించుకున్నవారిలో అత్యధికంగా 23 శాతం మంది మహిళలున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు 12శాతం మంది, రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారు 11 శాతం మంది 108 సేవల్ని వినియోగించుకున్నారు.

First Published:  3 July 2023 12:37 AM GMT
Next Story