Telugu Global
Andhra Pradesh

సన్నీ లియోన్ పై కామెంట్లు.. రోజాకు నెటిజన్ల కౌంటర్లు

సాటి నటి అనే మర్యాద కూడా లేకుండా సన్నీ లియోన్ ని రోజా అవమానించారని మండిపడుతున్నారు నెటిజన్లు. పవన్ కల్యాణ్ ని తిట్టేందుకు మధ్యలో సన్నీ లియోన్ ఎందుకన్నారు.

సన్నీ లియోన్ పై కామెంట్లు.. రోజాకు నెటిజన్ల కౌంటర్లు
X

పవన్ కల్యాణ్ ని విమర్శించే క్రమంలో మంత్రి రోజా నిన్న సన్నీ లియోన్ పేరు తెరపైకి తెచ్చారు. పవన్ నీతులు చెప్పడం సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉందని పోల్చారు. ఇక్కడ పవన్ ని తిట్టాలనే కోపంలో రోజా.. సన్నీ లియోన్ ని తక్కువ చేశారు. వెంటనే దీనికి రియాక్షన్ వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు మంత్రి రోజాకు కౌంటర్లిస్తున్నారు.

సన్నీ లియోన్ పోర్న్ స్టార్ కావొచ్చు కానీ, అదంతా గతం. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమెను పోర్న్ స్టార్ అంటూ ఎగతాళి చేసినవారే, తర్వాత ఆమెతో కలసి నటించారు, అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. పిల్లలను దత్తత తీసుకుని పెంచడంతోపాటు, చారిటీ కార్యక్రమాలకు కూడా సన్నీ ముందుంటారు. నటనకు నిజ జీవితానికి ఎంతో తేడా ఉంటుందని రుజువు చేశారామె. ఒకటి రెండు తెలుగు సినిమాలు కూడా చేసిన సన్నీ.. మళ్లీ ఇప్పుడు తెలుగు నాట సంచలనంగా మారారు. మంత్రి రోజా ఆమెను వెటకారం చేస్తూ చేసిన కామెంట్లు, ఆ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు సన్నీని సపోర్ట్ చేస్తూ మంత్రి రోజాపై కామెంట్లు పెడుతున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వ్యాఖ్యలు మరీ శృతి మించాయి.


సాటి నటి అనే మర్యాద కూడా లేకుండా సన్నీ లియోన్ ని రోజా అవమానించారని మండిపడుతున్నారు నెటిజన్లు. పవన్ కల్యాణ్ ని తిట్టేందుకు మధ్యలో సన్నీ లియోన్ ఎందుకన్నారు. కెరీర్ తొలినాళ్లలో రోజా గ్లామరస్ రోల్స్ చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకురాలైనంత మాత్రాన నీతులు మాట్లాడుతూ, మిగతా వాళ్లంతా తప్పుడువాళ్లే అన్నట్టుగా గేలి చేయడం సరికాదంటున్నారు. మంత్రి రోజా ఈ కౌంటర్లకు బదులిస్తారా..? సన్నీ లియోన్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా..? వేచి చూడాలి.

First Published:  15 July 2023 2:13 AM GMT
Next Story