Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు భద్రతకు ఏమైంది?

నేషనల్ సెక్యూరిటి గార్డ్స్(ఎన్ఎస్జీ) గ్రూప్ కమాండర్ కోషియార్ సింగ్ టెక్నికల్ నిపుణులతో పార్టీ ఆఫీసు, చంద్రబాబు ఇల్లు, ప్రయాణించే వాహనం, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బస చేసే కారవాన్ తదితరాలను తన టీంతో పరిశీలించారు.

చంద్రబాబు భద్రతకు ఏమైంది?
X

చంద్రబాబు నాయుడు భద్రతకు ఏమైంది? ఇప్పుడిదే ప్రశ్న తమ్ముళ్ళని బాగా వేధిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే హఠాత్తుగా నేషనల్ సెక్యూరిటి గార్డ్స్(ఎన్ఎస్జీ) గ్రూప్ కమాండర్ కోషియార్ సింగ్ రావటమే. కోషియార్ సింగ్ టెక్నికల్ నిపుణులతో పార్టీ ఆఫీసు, చంద్రబాబు ఇల్లు, ప్రయాణించే వాహనం, ఇతర ప్రాంతాలకు వెళ్ళినపుడు బస చేసే కారవాన్ తదితరాలను తన టీంతో పరిశీలించారు. జిల్లాల్లో పర్యటిస్తున్న సందర్భంగా చంద్రబాబుపై దాడులు జరిగే అవకాశాలున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇలాంటి ప్రచారాలతో సెక్యూరిటీ సిబ్బంది తమ హెడ్ క్వార్టర్స్ కు సమాచారం అందించారట. దాడులకు సంబంధించిన సమాచారాన్నే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అందించిందట. దాంతో అప్రమత్తమైన కోషియార్ వెంటనే విజయవాడకు చేరుకున్నారు. పర్యటనల్లో చంద్రబాబు ఉపయోగిస్తున్న ప్రచార రథాలను పరిశీలించారు. చంద్రబాబు ఎక్కడ నిలబడి మాట్లాడుతారు? రథంలో ఎక్కడ కూర్చుంటారనే విషయాలను కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారట.

పార్టీ ఆఫీసులో కూడా ఎక్కువగా ఎక్కడ కూర్చుంటారు, ఏ సమయానికి వచ్చి ఎప్పుడు వెళతారనే విషయాలను కూడా తెలుసుకున్నారు. ప్రచార రథంపై చంద్రబాబు నిలబడి మాట్లాడే స్ధానంలో చుట్టూతా ఆరు అడుగుల ఎత్తులో గ్లాస్ షీటు ఏర్పాటు చేయాలని సూచించారట. బహుశా దీన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అని అనుకుంటున్నారు. అలాగే ఇల్లు, ఫార్టీ ఆఫీసులో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారట.

చంద్రబాబు పర్యటించే జిల్లాలకు ముందుగా వెళ్ళాల్సిన సెక్యూరిటి సిబ్బంది ఎవరు? ఫాలో అయ్యే సిబ్బంది ఎవరనే విషయాలపైన కూడా చర్చించారట. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు భద్రతకు ముప్పంటే ఆశ్చర్యంగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించటం ఎంత అవసరమో చంద్రబాబుకే ఎక్కువ తెలుసు. అందుకనే కొత్త పద్దతుల్లో ప్రచారం మొదలుపెట్టారు. మొన్నటి బాపట్ల పర్యటనలో హఠాత్తుగా వాహనం దిగేసి టీ కొట్టులోకి వెళ్ళి కూర్చుకోవటం తెలిసిందే. ఇలాంటి సర్ ప్రైజ్‌లు వద్దని చంద్రబాబుకు సూచించారట. మరి చివరకు ఏమవుతుందో ఏమో.

First Published:  17 Dec 2022 7:26 AM GMT
Next Story