Telugu Global
Andhra Pradesh

ప్రభాస్ సినిమాకి నారా లోకేష్ ప్రమోషన్..

ప్రభాస్ కొత్త సినిమా 'కల్కి' గ్లింప్స్ అదుర్స్ అంటూ ట్వీట్ చేశారు లోకేష్. హాలీవుడ్ లెవల్లో ఉందంటూ కితాబు ఇచ్చారు.

ప్రభాస్ సినిమాకి నారా లోకేష్ ప్రమోషన్..
X

బాలా మావయ్య సినిమా అదుర్స్, బాలా మావయ్య పర్ఫామెన్స్ సూపర్ అంటూ నారా లోకేష్ అప్పుడప్పుడూ ట్వీట్లు వేస్తుంటారు. బాలకృష్ణ మినహా ఇతర సినిమాల గురించి లోకేష్ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు అరుదు. పైగా ఇప్పుడాయన యువగళంలో బిజీగా ఉన్నారు. సినిమాలు, ట్రైలర్లు చూస్తారని, వాటిని మెచ్చుకుంటారని అనుకోలేం. కానీ లోకేష్ మాత్రం ప్రభాస్ కొత్త సినిమా గ్లింప్స్ చూసి సూపర్ అని మెచ్చుకున్నారు. యువగళంలో బిజీగా ఉండి కూడా ప్రభాస్ సినిమాకోసం ఆయన ఓ ట్వీట్ వేశారు. సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


ప్రభాస్ సినిమా అనే కంటే.. నారా లోకేష్ పరిభాషలో ఇది టీడీపీ నేత అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనుకోవాలి. అందుకే లోకేష్ ట్వీట్ వేశారని అప్పుడే సెటైర్లు పడుతున్నాయి. పోనీ లోకేష్ అవసరం ఏదయినా, అభిమానం ఎవరిమీదయినా ఆయన మాత్రం ప్రభాస్ కొత్త సినిమా 'కల్కి' గ్లింప్స్ అదుర్స్ అంటూ ట్వీట్ చేశారు. హాలీవుడ్ లెవల్లో ఉందంటూ కితాబు ఇచ్చారు.


కల్కి సినిమా గ్లింప్స్ చూసి సూపర్ థ్రిల్ అయ్యాను అని అన్నారు నారా లోకేష్. అశ్వినీదత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, నాగ్ అశ్విన్.. ఇలా అందరి పేర్లు మెన్షన్ చేస్తూ ట్వీట్ వేశారు లోకేష్. శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో ప్రదర్శించబోతున్న తొలి భారతీయ సినిమాగా కల్కి ఇప్పటికే అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేష్ అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఇది నిజంగా గర్వకారణం అన్నారు.

First Published:  21 July 2023 6:30 AM GMT
Next Story