Telugu Global
Andhra Pradesh

ప్రియమైన ఎలాన్ మస్క్ గారికి.. లోకేష్ నమస్కరించి వ్రాయునది

మస్క్ ని నేరుగా ట్యాగ్ చేస్తూ లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాదు.. నెటిజన్ల నుంచి ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది.

ప్రియమైన ఎలాన్ మస్క్ గారికి.. లోకేష్ నమస్కరించి వ్రాయునది
X

ఈనెల 22న టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఏపీలోనూ హడావిడి మొదలైంది. భారత్ లో టెస్లా కార్ల ప్లాంట్ ని నెలకొల్పేందుకు మస్క్ ఆసక్తిగా ఉన్నారన్న సమాచారంతో కర్నాటక, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆ కంపెనీ ప్రతినిధుల్ని తమ రాష్ట్రాలకు ఆహ్వానించాయి. ఏపీ నుంచి ఇప్పటికే టెస్లాకు రెండు సార్లు మెయిల్స్ పంపించామని అధికారులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన రవాణా సౌకర్యాలు, పోర్ట్ లు అందుబాటులో ఉన్నందున ఏపీని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు ఈమెయిల్స్ లో సూచించారు. అయితే ఈ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికి పోకూడదనే ఉద్దేశంతో నారా లోకేష్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.


నారా లోకేష్ నేరుగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేయడం విశేషం. మస్క్ భారతదేశాన్ని సందర్శిస్తారన్న వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అంటున్న లోకేష్.. గతంలో చంద్రబాబు మస్క్ ని కలసిన ఫొటోని కూడా ట్వీట్ చేశారు. రెండు నెలల్లో మేం సిద్ధంగా ఉంటాం, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఆయన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ వేశారు లోకేష్. అంటే రెండు నెలల్లో ఎన్నికలైపోయి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే ధీమాతో లోకేష్ ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. మస్క్ ని నేరుగా ట్యాగ్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాదు.. వైరి వర్గాలనుంచి ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. ఏపీ టెస్లాకు పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనే మాట నిజమే అయినా.. టెస్లాతో ఒప్పందం చేసుకునేది మళ్లీ వచ్చే వైసీపీ ప్రభుత్వమేనని, టీడీపీ ఆధ్వర్యంలో కూటమి గెలవడం అసాధ్యమని కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు.

కోయంబత్తూర్ లో కూడా కోతలు..

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన నారా లోకేష్.. అక్కడ కూడా ఓ రేంజ్ లో కోతలు కోశారు. మంచి నాయకత్వం ఉంటే చెన్నై నగరం ఇప్పటికే హైదరాబాద్ ని మించిపోయి ఉండేదని అన్నారాయన. అటువంటి నాయకత్వం తమిళనాడుకి కావాలని, బీజేపీ ఆధ్వర్యంలో సరైన నాయకత్వం వస్తుందని చెప్పారు. అక్కడి పారిశ్రామిక వేత్తలతో కూడా సమావేశమైన లోకేష్.. రెండు నెలల్లో ఏపీలో మన ప్రభుత్వమే వస్తుందని, అందరూ పెట్టుబడులతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. లోకేష్ ప్రసంగంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

First Published:  13 April 2024 6:38 AM GMT
Next Story