Telugu Global
Andhra Pradesh

ఇంకా ఏం పీకాలి?

లోకేష్‌కు ఇంకా అర్థంకాని విషయం ఏమిటంటే చంద్రబాబు 50 రోజులుగా జైలులో ఉండటానికి మించిన పీకుడు ఏముంటుంది? ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎంతమంది లాయర్లను రంగంలోకి దించినా, ఎన్ని పిటీషన్లు వేసినా బెయిల్, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ రావటంలేదు.

ఇంకా ఏం పీకాలి?
X

చంద్రబాబు అరెస్టు ముందు వరకు తండ్రీ కొడుకులు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కో అనే వాళ్ళు. చేతి మీద వెంట్రుకను కూడా పీకలేవని పదేపదే రెచ్చగొట్టేవారు. అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడిన ఫలితం ఇప్పుడు కళ్ళముందే కనబడుతోంది. ఓపిక పట్టిన జగన్ మంచి ముహూర్తం చూసుకుని ఒక్క పీకు పీకితే చంద్రబాబు పోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూర్చున్నారు. జగన్ దెబ్బకు చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి, తమ్ముళ్ళకి దిక్కులు తెలియ‌డం లేదు.

అలాంటిది ఇప్పుడు ఏం పీకారంటు మళ్ళీ లోకేష్ మొదలుపెట్టారు. తమ పీకుడు భాష వల్లే తమకిన్ని కష్టాలు వచ్చాయన్న కనీస జ్ఞానం కూడా లోకేష్‌లో కనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. శనివారం సాయంత్రం జైలులో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు 50 రోజులుగా తన తండ్రిని జైలులో ఉంచిన జగన్ ఏమి పీకారని రెచ్చగొట్టడమే విచిత్రంగా ఉంది.

లోకేష్‌కు ఇంకా అర్థంకాని విషయం ఏమిటంటే చంద్రబాబు 50 రోజులుగా జైలులో ఉండటానికి మించిన పీకుడు ఏముంటుంది? ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎంతమంది లాయర్లను రంగంలోకి దించినా, ఎన్ని పిటీషన్లు వేసినా బెయిల్, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ రావటంలేదు. ఇంతకన్నా చంద్రబాబు ఇంకా ఏమి పీకించుకోవాలని లోకేష్ అనుకుంటున్నారో అర్థంకావటంలేదు. చట్టానికి, న్యాయానికి తాను అతీతుడనని అనుకుంటున్న చంద్రబాబుపైన సీఐడీ నాలుగు కేసులు పెట్టింది.

స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రిమాండులో ఉన్నారు. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగురోడ్డు, అంగళ్ళ అల్లర్ల కేసులు కూడా బుక్కయ్యాయి. అన్నీ కేసుల్లో కలిపి ఎనిమిది పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. ఇవికాకుండా రాజధాని నిర్మాణాల్లో ముడుపులు అందుకున్న ఆరోపణలపై ఐటి శాఖ నోటీసు జా రీచేసి విచారణకు రెడీ అవుతోందట. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు తనపై నమోదైన కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. 50 రోజులుగా జైలులో ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా జగన్‌ను పట్టుకుని చంద్రబాబును ఏమి పీకావని లోకేష్ అడగటంలోనే అజ్ఞానమంతా బయటపడుతోంది.


First Published:  29 Oct 2023 7:15 AM GMT
Next Story