Telugu Global
Andhra Pradesh

పందులే గుంపుగా వస్తాయ్.. లోకేష్ కి రివర్స్ లో తగిలిన పంచ్

రజినీకాంత్ ఏపీకి వచ్చి ఎన్టీఆర్ తో తనకున్న అభిమానం గురించి చెప్పి, చంద్రబాబు విజనరీని మెచ్చుకుని వెళ్లిపోయారని, ఆరోజు జగన్ ఇంట్లో టీవీలు పగిలిపోయాయని అన్నారు లోకేష్.

పందులే గుంపుగా వస్తాయ్.. లోకేష్ కి రివర్స్ లో తగిలిన పంచ్
X

పందులే గుంపుగా వస్తాయ్.. లోకేష్ కి రివర్స్ లో తగిలిన పంచ్

రజినీకాంత్ పై వైసీపీ నేతల విమర్శలకు యువగళం యాత్రలో ఉన్న నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రజినీకాంత్ సినిమా డైలాగ్ ని గుర్తు చేశారు. 'నాన్నా పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది' అంటూ శివాజీ సినిమాలో రజినీ ఫేమస్ డైలాగ్ ని బహిరంగ సభలో చెప్పారు లోకేష్. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అలాగే ఉందన్నారు. రజినీకాంత్ సింగిల్ గా సింహంలా వచ్చి మాట్లాడి వెళ్లిపోయారని, ఆ తర్వాత వైసీపీ నేతలే గుంపులు గుంపులుగా వచ్చి ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రజినీకాంత్ ఏపీకి వచ్చి ఎన్టీఆర్ తో తనకున్న అభిమానం గురించి చెప్పి, చంద్రబాబు విజనరీని మెచ్చుకుని వెళ్లిపోయారని, ఆరోజు జగన్ ఇంట్లో టీవీలు పగిలిపోయాయని అన్నారు లోకేష్. ఆ తర్వాత వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా వచ్చి రజినీకాంత్ పై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. రజినీకి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ ఇటీవల చంద్రబాబు ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే.

రివర్స్ అటాక్..

యువగళంలో నారా లోకేష్ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. ఏపీలో సింహం జగన్ ఒక్కరే అని, ఆయన సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగుతున్నారని, గుంపులుగా వచ్చే పందులెవరో అందరికీ తెలుసని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సింగిల్ గా వచ్చే దమ్ము లోకేష్ కి ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రజినీకాంత్ డైలాగ్ ని లోకేష్ బాగానే చెప్పినా, ఈ కౌంటర్లు మాత్రం టీడీపీ తట్టుకోలేకపోతోంది. రజినీపై వైసీపీ విమర్శకు ఆ డైలాగ్ అతికినట్టు సరిపోయిందని అనుకున్నా.. ఎన్నికల వేళ టీడీపీ పొత్తుల వ్యవహారాన్ని వైసీపీ అభిమానులు హైలెట్ చేస్తున్నారు. ఎన్నికల రణ క్షేత్రంలో సింగిల్ గా వచ్చే సింహం జగన్ మాత్రమే అని, పొత్తులకోసం వెంపర్లాడుతున్న టీడీపీ, జనసేన పందుల సమూహం అంటూ విమర్శిస్తున్నారు.

First Published:  3 May 2023 12:38 AM GMT
Next Story