Telugu Global
Andhra Pradesh

జగన్ నిర్ణయం చారిత్రక తప్పు.. సొంత కుటుంబ సభ్యులు ఛీ కొడుతున్నారు.. లోకేష్ ఫైర్

లోకేష్ ట్వీట్ కి సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆయనకు మద్దతుగా వచ్చిన కామెంట్స్ కంటే.. ఆయనను విమర్శిస్తూ వచ్చిన కామెంట్స్ అధికంగా ఉన్నాయి. 'ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొన్నారు.. ఇప్పుడు ఆయన పేరు పోతోందని ఎందుకు ఈ ఏడుపులు' అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.

జగన్ నిర్ణయం చారిత్రక తప్పు.. సొంత కుటుంబ సభ్యులు ఛీ కొడుతున్నారు.. లోకేష్ ఫైర్
X

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. అందుకు దీటుగా వైసీపీ శ్రేణులు సమాధానం ఇస్తున్నారు. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పటికే స్పందించగా.. తాజాగా నారా లోకేష్ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.

'నువ్వేదైనా కట్టి మీ నాన్నగారి పేరు పెట్టుకుంటే అందరూ ఆహ్వానించేవారు. కానీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు తొలగించి చారిత్రక తప్పు చేశావ్ జగన్ రెడ్డి. అందుకే నీ సొంత కుటుంబ సభ్యులు సైతం నీ నిర్ణయాన్ని ఛీ కొడుతున్నారు.' అని లోకేష్ ట్వీట్ చేశారు. కాగా లోకేష్ ట్వీట్ కి సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

ఆయనకు మద్దతుగా వచ్చిన కామెంట్స్ కంటే.. ఆయనను విమర్శిస్తూ వచ్చిన కామెంట్స్ అధికంగా ఉన్నాయి. 'ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొన్నారు.. ఇప్పుడు ఆయన పేరు పోతోందని ఎందుకు ఈ ఏడుపులు' అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.

'మీరు కూడా సొంతంగా పార్టీ పెట్టి ప్రజల మధ్యకు రండి. ఎవరో పెట్టిన పార్టీని మీరు దొంగలిస్తే ఎలా' అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. 'మరి నీ కొడుకు ఏం సాధించాడని నారా దేవాన్ష్ కాలనీ అని పేరు పెట్టావ్ లోకేషా? అని ఓ నెటిజన్ సెటైర్ వేశారు. 'ఎన్టీఆర్ ను అప్పట్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఆ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఆయనకు మీకూ మధ్య ఏ సంబంధం లేదు.' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

First Published:  24 Sep 2022 12:26 PM GMT
Next Story