Telugu Global
Andhra Pradesh

జగన్‌కు అంటగట్టావ్‌ సరే, మీ నాయన మాటేమిటి లోకేష్‌..?

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సై, కొందరు కానిస్టేబుళ్లపై రేప్‌ కేసులు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అంత మాత్రాన చంద్రబాబు పాలనలో పోలీసులందరూ రేపిస్టులేనని అనవచ్చునా..? అని లోకేష్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది.

జగన్‌కు అంటగట్టావ్‌ సరే, మీ నాయన మాటేమిటి లోకేష్‌..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ముద్దుల తనయుడు నారా లోకేష్‌కు ప్రతిదాన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అంటగట్టడం అలవాటుగా మారింది. తన తండ్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేరాలే జరగనట్లు, అంతా సజావుగా సాగినట్లు ఫోజులు ఇచ్చుకోవడం కూడా ఆయనకు అలవాటుగానే మారింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల తప్పు జరిగినా కూడా జగన్‌నే ఆయన టార్గెట్‌ చేస్తుంటారు. గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడడంపై ఆయన వీరావేశంతో స్పందించారు. దానికి జగన్‌ బాధ్యుడనే రీతిలో ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సై, కొందరు కానిస్టేబుళ్లపై రేప్‌ కేసులు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అంత మాత్రాన చంద్రబాబు పాలనలో పోలీసులందరూ రేపిస్టులేనని అనవచ్చునా..? అని లోకేష్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది. లక్షకు పైగా ఉన్న ఫోర్స్‌లో ఒకరో ఇద్దరో తప్పులు చేయవచ్చు. అంత మాత్రాన ఏ మూలన తప్పు జరిగిన మొత్తం పోలీసు వ్యవస్థను, ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేయడమంటే లోకేష్‌ దురుద్దేశమేమిటో అర్థమవుతూనే ఉంది. జగన్‌ను ఏదో ఒక విధంగా అప్రతిష్టపాలు చేసి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే కుయుక్తి అది. ఆయన ఆటలు సాగవని ప్రజలు చెప్పబోతున్నారు.

గతంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వలంటీర్‌ వ్యవస్థపై అలాగే మాట్లాడారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వలంటీర్లంతా అంతే అన్నట్లుగా మాట్లాడారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తుంటే, ప్రజలు జగన్‌కు జై కొడుతారనే భయంతో పవన్‌ కల్యాణ్‌ ఆ వ్యవస్థను దుమ్మెత్తిపోశారు. నారా లోకేష్‌ కూడా మిడిమిడి జ్ఞానంతో అదే పనిచేశారు.

First Published:  2 Feb 2024 4:28 PM GMT
Next Story